గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే ఫైనల్ డెడ్ లైన్.. ఇది చేయకపోతే డబ్బులు కట్..

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే ఫైనల్ డెడ్ లైన్.. ఇది చేయకపోతే డబ్బులు కట్..

మీరు గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారా.. అయితే మీకు అలర్ట్. జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. ఆలోపు ఈ పని చేయకపోతే సబ్సిడీ నగదు ఆగిపోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా దేశంలోని పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లతో పాటు సిలిండర్ల బుకింగ్‌పై సబ్సిడీ కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకం అమల్లో ఉండగా.. దేశంలో కొట్లాది మంది లబ్దిదారులుగా ఉన్నారు. ఈ పధకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్, ఇన్‌స్టాలేషన్‌తో పాటు తొలి సిలిండర్ ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత సిలిండర్ రిఫిల్లింగ్‌పై రూ.300 సబ్సిడీ అందిస్తోంది. ఈ సబ్సిడీ పొందేవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పని చేయకపోతే సబ్సిడీ నిలిచిపోతుందని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

కేవైసీ తప్పనిసరి..
జూన్ 30వ తేదీలోపు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్దిదారులు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. ఆలోపు పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ డబ్బులు నిలిచిపోతాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలైన ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్ లబ్దిదారులను అలర్ట్ చేస్తూ ప్రకటన జారీ చేశాయి. ఈకేవైసీ పూర్తి చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసిందని, జూన్ 30లోగా పూర్తి చేయాలని కంపెనీలు తెలిపాయి. అన్ని గ్యాస్ కంపెనీల కస్టమర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. సబ్సిడీ ప్రయోజనాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా పొందాలంటే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ఉచితంగా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. గ్యాస్ కంపెనీల డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్, డెలివరీ బాయ్ దగ్గర ఉండే బయోమెట్రిక్ మెషిన్లు, సమీపంలోని మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

ఎలా చేసుకోవాలి..?
ఈ రోజు కేవైసీ పూర్తి చేసి మీ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని కొనసాగించాలని ఆయిల్ కంపెనీలు తమ కస్టమర్లను సూచిస్తున్నాయి. కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు అయితే ఇండియన్ ఆయిల్ వన్ యాప్, ఆధార్ ఫేస్ ఐడీ యాప్‌ల ద్వారా చేసుకోవాలి. ఇక భారత్ గ్యాస్ వినియోగదారులు అయితే హలో బీపీసీఎల్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు అయితే హెచ్‌పీ పే యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే కేవైసీ చేసుకోవచ్చు. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబరు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం, ఆధార్ ఫేస్ ఐడీ యాప్ ద్వారా మీ ఫేస్ చూపించడం ద్వారా కేవైసీ పూర్తవుతుంది. అయితే ఇదివరకే మీరు కేవైసీ పూర్తి చేసి ఉంటే మళ్లీ అవసరం లేదు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు