వివిధ కారణాల వల్ల హైదరాబాద్లోని పలు ఎంఎంటీసీ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఏయే తేదీల్లో ఈ రైళ్లు రద్దు కానున్నాయో తెలుసుకుందాం.. అయితే ఎంఎంటీఎస్ లో ప్రయాణించే ప్రయాణికులు…
రైల్వే నిర్వహణ కారణాల (Operational reasons) వల్ల హైదరాబాద్ నగరంలో నడిచే పలు MMTS రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 10 నుండి జూన్ 12 వరకు వేర్వేరు తేదీల్లో ఈ మార్పులు అమలులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతాల్లో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తుగా గమనించడం చాలా ముఖ్యం. పాక్షికంగా రద్దయిన రైళ్లు, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- జూన్ 10, 2026 నుండి జూన్ 12, 2026 వరకు పాక్షికంగా రద్దయిన రైళ్లు:
రైలు నంబర్ 47155 (ఫలక్నుమా – రామచంద్రాపురం): ఈ రైలు లింగంపల్లి – రామచంద్రాపురం స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు.
రైలు నంబర్ 47142 (రామచంద్రాపురం – హైదరాబాద్): ఈ రైలు రామచంద్రాపురం – లింగంపల్లి స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు. - జూన్ 10, జూన్ 11, 2026 తేదీలలో పాక్షికంగా రద్దయిన రైళ్లు:
రైలు నంబర్ 47253 (ఘటకేసర్ – రామచంద్రాపురం): ఈ రైలు సనత్నగర్ – రామచంద్రాపురం స్టేషన్ల మధ్య పాక్షింకంగా రద్దు.
రైలు నంబర్ 47254 (రామచంద్రాపురం – ఘటకేసర్): ఈ రైలు రామచంద్రాపురం – సనత్నగర్ స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు.
Please follow and like us:

