జగన్‌ తెనాలి పర్యటనపై పొలిటికల్ హీట్.. ఒకరిపై ఒకరు కౌంటర్!

జగన్‌ తెనాలి పర్యటనపై పొలిటికల్ హీట్.. ఒకరిపై ఒకరు కౌంటర్!

ఇటు మరో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల కూడా జగన్‌ తెనాలి పర్యటనపై ఫైర్ అయ్యారు. రఘురామకృష్ణంరాజుపై దాడి చేసిన వాళ్లను ఏం చేయాలన్నారు..? జగన్‌ తెనాలి వెళ్లి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు జనసేన నేతలు కూడా..

వైసీపీ అధినేత జగన్‌ తెనాలి పర్యటన పొలిటికల్‌ హీట్‌ పెంచింది. కేసులున్నంత మాత్రాన రోడ్డుమీదే కొడతారా..? అమాయకులను రౌడీషీటర్లుగా చిత్రీకరిస్తారా…? అంటూ వైసీపీ ఆగ్రహావేశాలు వెల్లగక్కుతుంటే.. రౌడీలున్న పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్‌ ఎటాక్‌కి దిగారు కూటమి నేతలు. కేసులుంటే రోడ్లపైనే కర్రలతో కొడతారా..? చంద్రబాబుపైనా 24 కేసులున్నాయ్‌.. ఆయన విషయంలోనూ ఇలాగే ప్రవర్తిస్తారా ?అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్‌. దళితులను కొట్టి రౌడీషీటర్లుగా ముద్రవేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారాయన. ప్రభుత్వ పద్దతి అసలేం బాలేదన్నారు.

ఏపీలో అరాచక పాలన నడుస్తోందన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమాయకులను కొడితే ఏమొస్తుందన్నారు..? గుర్తుపెట్టుకోండి లెక్కకు లెక్క తేలుస్తామంటూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు.

అలాగే వైసీపీ నేతల మాటలకు ఇటు కూటమి పార్టీల నేతలు కూడా తగ్గేదేలే అన్నట్లు కౌంటర్‌ ఎటాక్‌కి దిగారు. నందిగం సురేష్‌, బోరుగడ్డ అనిల్‌ లాంటి రౌడీలున్న పార్టీ వైసీపీ అంటూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ విమర్శలు గుప్పించారు.

ఇటు మరో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల కూడా జగన్‌ తెనాలి పర్యటనపై ఫైర్ అయ్యారు. రఘురామకృష్ణంరాజుపై దాడి చేసిన వాళ్లను ఏం చేయాలన్నారు..? జగన్‌ తెనాలి వెళ్లి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు జనసేన నేతలు కూడా జగన్‌ పర్యటన, వైసీపీ నేతల కామెంట్స్‌పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఎంతోమందిని వేధించి.. ఆఖరికి డెడ్‌బాడీలు డోర్‌ డెలివరీ చేసిన వాళ్లకు మాట్లాడే అర్హతే లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా… జగన్‌ తెనాలి పర్యటన రాజకీయ రచ్చ లేపింది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు