ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్ ఇలియానా. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంని స్టార్ డమ్ సంపాదించుకుంది. దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా దూసుకుపోయిన ఈ అమ్మడు అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు బాబు, భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.
దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ఇలియానా. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పోకిరి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ కొన్నాళ్లు వరుస హిట్స్ తో అలరించిన ఈ బ్యూటీ నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది. ఆమె నటించిన చిత్రాలు ప్లాప్స్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇలియానా.. ఆకస్మాత్తుగా ప్రెగ్నెంట్ అంటూ అభిమానులకు షాకిచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు తన భర్త, బాబును ఫ్యాన్స్ కు పరిచయం చేసింది. ప్రస్తుతం ఇలియనా రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్ల తెలిపింది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది.
ఇన్ స్టా వేదికగా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ ఆమె నటించిన హిట్ మూవీ గురించి ప్రశ్నించగా.. ఇలియానా రియాక్ట్ అవుతూ.. ఆ సినిమా సీక్వెల్ ఛాన్స్ తనకే వచ్చిందని.. కానీ తనే దానిని రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. మేడమ్ రైడ్ 2 చిత్రంలో మీరెందుకు నటించలేదు ? మీ కమ్ బ్యాక్ ఎప్పుడు ఉంటుంది ? అని ఓ నెటిజన్ అడగ్గా.. ఇలియానా స్పందిస్తూ.. “సినిమాలను నేను ఎంతో మిస్ అవుతున్నాను.. నాకు కూడా ఆ చిత్రంలో భాగం కావాలనిపించింది. రైడ్ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. మాలిని పాత్రలో మరోసారి నటించాలనుకున్నాను.. ఈ సినిమా సీక్వెల్ చేయాలనుకున్నప్పుడు టీమ్ నన్ను సంప్రదించింది. మళ్లీ యాక్ట్ చేయమని అడిగింది. కానీ నాకు అదే సమయంలో బాబు పుట్టాడు. దీంతో నా ప్రాధాన్యతలు మారిపోయాయి” అంటూ చెప్పుకొచ్చింది.
భవిష్యత్తులో సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా ? అని మరో నెటిజన్ అడగ్గా.. తప్పకుండా వస్తానని ఆన్సర్ ఇచ్చింది ఇలియానా. 2023లో మైఖేల్ డోలన్ అనే వ్యక్తితో ఇలియానా వివాహం జరగ్గా.. అదే ఏడాది ఒక బాబు జన్మించారు. ఇక ఇలియానా నటించిన రైడ్ చిత్రం 2018లో విడుదలైంది. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. ఇక ఆ తర్వాత ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన రైడ్ 2 చిత్రం మే ప్రారంభంలో విడుదలైంది.