రోజు ఒక్క చిటికెడు.. చచ్చుబడిన నరాలు కూడా గుర్రాల్లా పరిగెడతాయి! రామబాణం లాంటి చిట్కా..!

రోజు ఒక్క చిటికెడు.. చచ్చుబడిన నరాలు కూడా గుర్రాల్లా పరిగెడతాయి! రామబాణం లాంటి చిట్కా..!

ఆరోగ్యం అనేది మార్కెట్లో దొరికే టాబ్లెట్లలో లేదు, మనం తినే సాంప్రదాయ ఆహారంలోనే ఉంది. రసాయనాలతో కూడిన పదార్థాలను పక్కన పెట్టి, ప్రకృతి సిద్ధమైన ఆహారాలను మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి రోగాలనైనా నయం చేసుకోవచ్చు.

ఆధునిక జీవనశైలి, రసాయనాలతో కూడిన ఆహార అలవాట్ల వల్ల నేడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య నరాల బలహీనత. చేతులు వణకడం, కాళ్ళు లాగడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు. అయితే, ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సాంప్రదాయ ఆహార నియమాలతో చచ్చుబడ్డ నరాలను సైతం తిరిగి ఉత్తేజితం చేయవచ్చని ప్రముఖ ఆహార నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి స్పష్టం చేస్తున్నారు.

ఆధునిక వైద్య వ్యాపారం – మనుషుల్లో పెరుగుతున్న భయాలు..
నేటి సమాజంలో అనారోగ్యం కంటే రోగం వస్తుందనే భయమే మనుషులను ఎక్కువగా పీడిస్తోంది. ముందస్తు పరీక్షల పేరుతో, హెల్త్ ఇన్సూరెన్స్‌ల పేరుతో కార్పొరేట్ సంస్థలు ప్రజల భయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి. ముప్పై ఏళ్లు రాగానే బాడీ చెకప్ చేయించుకోకపోతే ఏదో అయిపోతుందనే భ్రాంతిని కల్పిస్తున్నారు. మనం తాగే టీ, కాఫీ, పాలు, పంచదార, మైదా, పాలిష్ చేసిన బియ్యం వంటి ప్రాసెస్డ్ ఆహారాల వల్లే శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణిస్తోంది. కేవలం ఒక్క గ్రాము చక్కెర తింటే, శరీరంలోని రోగనిరోధక శక్తి ఆరు నెలల పాటు నిర్వీర్యమవుతుందని డాక్టర్ ఖాదర్ వలి హెచ్చరిస్తున్నారు.

విటమిన్ల పేరుతో సాగుతున్న సరికొత్త స్కామ్..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, గంటల తరబడి ఏసీ గదుల్లో కూర్చునే వారికి సూర్యరశ్మి తగలకపోవడం వల్ల విటమిన్-డి లోపం ఏర్పడుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని విటమిన్ టాబ్లెట్ల వ్యాపారం బిలియన్ డాలర్లకు చేరుకుంది. నిజానికి కృత్రిమ సప్లిమెంట్ల వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారానికి ఒకసారి ఎండబెట్టిన పుట్టగొడుగులను నానబెట్టుకుని తింటే విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది. అదేవిధంగా, విటమిన్ బి-12 కేవలం మాంసాహారంలోనే ఉంటుందనేది ముమ్మాటికీ అబద్ధం. మన నోటిలో, పొట్టలో ఉండే లాక్టోబాసిల్లస్ వంటి సూక్ష్మజీవులే బి-12ను తయారు చేస్తాయి. కొబ్బరి పాలు, నువ్వుల పాలు తాగి, కొబ్బరి పాలతో తోడుపెట్టిన పెరుగును వారానికి రెండు చెంచాలు తింటే విటమిన్ బి-12 లోపం అస్సలు రాదు.

నరాల వీక్ నెస్ కి రామబాణం.. నువ్వుల నూనె మహత్యం..
పక్షవాతం, నరాల బలహీనత, పార్కిన్సన్స్ (చేతులు, కాళ్లు వణకడం, మరుపు రోగం) వంటి భయంకరమైన వ్యాధులకు నువ్వుల నూనె ఒక అద్భుతమైన మందుగా పనిచేస్తుంది. వారం వారం మార్చుకుంటూ.. ఒక వారం నువ్వుల నూనె, మరో వారం కొబ్బరి నూనె, ఇంకోవారం వెర్రి నువ్వుల నూనెను ఉదయం పూట రెండు చెంచాల చొప్పున తాగుతుంటే నరాల బలహీనత పూర్తిగా మాయమవుతుంది.

కాగా, మన సాంప్రదాయంలో ఎవరైనా చనిపోయేటప్పుడు నోట్లో నువ్వులు పోయడానికి గల కారణం, శరీరంలో ఎక్కడైనా కొద్దిగా ప్రాణం మిగిలి ఉన్నా ఆ నువ్వుల శక్తితో మళ్లీ నరాలు ఉత్తేజితమై బతుకుతారనే నమ్మకమే. అంతటి మహత్యం నువ్వుల్లో ఉంది.

సిరిధాన్యాల గంజి, కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం..
తీవ్రమైన నిద్రలేమి, రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జనకు లేవడం వంటి సమస్యలతో బాధపడేవారు అరికెలు, సామెలు, కొర్రలు, అండుకొర్రలు వంటి సిరిధాన్యాలను ఉదయం నానబెట్టి, రాత్రి వండిన గంజిని తాగడం అలవాటు చేసుకోవాలి. దీనితో పాటు రావి ఆకు, గరిక, లేదా ఉల్లిపాయల కషాయం తాగుతుంటే ప్రోస్టేట్ సమస్యలు తగ్గి, రాత్రి పూట గాఢమైన నిద్ర పడుతుంది. మొలకెత్తిన వేరుశనగ గింజలు, వేరుశనగ నూనె తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన రెస్వెరట్రాల్ అనే అద్భుతమైన పోషకం అందుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

ఆరోగ్యం అనేది మార్కెట్లో దొరికే టాబ్లెట్లలో లేదు, మనం తినే సాంప్రదాయ ఆహారంలోనే ఉంది. రసాయనాలతో కూడిన పాలు, చక్కెరలను పక్కన పెట్టి, ప్రకృతి సిద్ధమైన సిరిధాన్యాలు, గానుగ నూనెలు, ఆకు కషాయాలను మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి రోగాలనైనా నయం చేసుకోవచ్చు. శారీరక శ్రమను పెంచుకుంటూ, రాత్రి వేళల్లో గదులను చీకటిగా ఉంచుకుని ప్రశాంతంగా నిద్రపోవడం ద్వారా నరాల వ్యవస్థను, సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగామన కోసమే. ఇందులో అందించిన చిట్కాలు పాటించేముందు ఓసారి నిపుణులను సంప్రదించి సరైన నిర్ణయం తీసుకుని ఫాలో చేయడం మంచిది.

Please follow and like us:
లైఫ్ స్టైల్ వార్తలు