యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1358 పోస్టులను భర్తీ చేయనుంది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1358 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 21, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..
మెడికల్ ఆఫీసర్స్‌ (జనరల్ డ్యూటీ/సెంట్రల్ హెల్త్‌ సర్వీస్‌) పోస్టుల సంఖ్య: 864
అసిస్టెంట్ డివిజినల్‌ మెడికల్ ఆఫీసర్‌ (రైల్వే) పోస్టుల సంఖ్య: 450
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌(న్యూ దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌) పోస్టుల సంఖ్య: 14
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌ (ఢిల్లీ) పోస్టుల సంఖ్య: 30
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ (MBBS)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌ ఫైనల్ ఇతర్‌ పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంటర్న్‌షిప్‌లో ఉన్నవారు కూడా దరఖాస్తు చేయవచ్చు. అయితే నియామక సమయానికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 1, 2026 నాటికి 32 ఏళ్లకు మించకూడదు. అంటే దరఖాస్తు చేసుకునే వారు ఆగస్టు 2, 1994 కంటే ముందు జన్మించి ఉండకూడదు. సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లోని మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ పోస్టులకు 35 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 31, 2026 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.200 చొప్పున చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి రుసుము అవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 500 మార్కులకు, పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ. 1,77,500 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు. రాత పరీక్ష ఆగస్టు 2, 2026వ తేదీన దేశ వ్యాప్తంగా పేపర్‌ పెన్ విధానంలో నిర్వహిస్తారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు