బ్లాక్ బస్టర్ తండేల్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..

బ్లాక్ బస్టర్ తండేల్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన సినిమా ఇది. ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది.

అక్కినేని యువ ఆ సామ్రాట్ నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించింది. తండేల్ సినిమాలో సాయి పల్లవి, నాగచైతన్య ఇద్దరూ తమ నటనతో మెప్పించారు. ఫిబ్రవరి 7న తండేల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందే పాటలు, ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచిన ఈసినిమా.. విడుదలయ్యాక భారీ రెస్పాన్స్ అందుకుంది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటుంది. చైతూ కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ఈ సినిమాలో రాజు, సత్య పాత్రలో నాగచైతన్య, సాయి పల్లవి జీవించేశారని..ముఖ్యంగా ఎమోషనల్ సీన్లతో చైతూ ఏడిపించేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. వీరి మధ్య హృద్యమైన ప్రేమను ముడిపెడుతూ.. దానికి సినిమాటిక్ హంగుల్ని జోడించి తెరపైన ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు. ఈ సినిమాకు సంగీతం మరో హైలెట్. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. ఈ మూవీలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.

అలాగే దేవీ శ్రీ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. తండేల్ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఇక తండేల్ సినిమా స్ట్రీమింగ్ డేట్ మార్చి 14గా ఖరారైనట్లు తెలుస్తోంది. ముందుగా మార్చ్ 6న అని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు మార్చి 14న ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా