రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలోకొన్నాయి. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నారు. అంతే కాదు ఈ సినిమాలో చరణ్ మాస్ అవతార్ లో కనిపించనుండటంతో అబీనిమానుల్లో ఉత్సహం రెట్టింపైంది. జూన్ 4న పెద్ది సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది. పెద్ది పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుండటంతో వివిధ భాషల్లోనూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు మూవీ టీమ్. ఈ క్రమంలోనే నిన్న ( జూన్ 1)న విజయవాడలో పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేశారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. చాలా రోజుల తర్వాత విజయవాడలో జరుగుతున్న పెద్ద సినిమా ఈవెంట్ ఇదే.. కాగా నిన్నటి ఈవెంట్ లో ఓ ఆసక్తికర సంఘటన చేసుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సక్సెస్ మీట్ సమయంలో హీరోల అభిమానులు స్టేజ్ పైకి రావడం.. హీరో కాళ్లపై పడటం మామలు అయిపొయింది. అలాగే నిన్న జరిగిన ఈవెంట్ లో ఓ అభిమాని రామ్ చరణ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు అక్కడే ఉన్న చరణ్ బాడీ గార్డ్ వెంటనే అప్రమత్తం అయ్యి అతన్ని అమాంతం ఎత్తుకొని పక్కకు తీసుకెళ్లిపోయాడు. దాంతో అక్కడ ఉన్నవారు అవాక్ అయ్యారు.
కాగా ఇటీవలే రామ్ చరణ్ ఓ కొత్త బాడీ గార్డ్ ను పెట్టుకున్నాడు’. రామ్ చరణ్ కొత్త బాడీ గార్డ్ పేరు కెవిన్ కుంట. ప్రస్తుతం పెద్ది ఈవెంట్స్ ఫొటోలు, వీడియోల్లో రామ్ చరణ్ లుక్స్ తో పాటు ఈ బాడీ గార్డ్ వీడియలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఎవరీ కెవిన్ కుంట అని ఆరా తీస్తున్నారు అభిమానులు. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్గా రాణిస్తున్నాడు. ఇటీవలే ముంబై లో జరిగిన పెద్ది ఈవెంట్ లో అభిమానులు చరణ్ చూడగానే ఎగబడ్డారు వారందరిని కెవిన్ నియంత్రించిన విధానం అందరిని ఆకట్టుకుంది. తాజాగా పెద్ది ఈవెంట్ లోనూ ఇలా ఓ అభిమాని చరణ్ దగ్గరకు రాగానే అతన్ని గడ్డ కోడిపిల్లను ఎత్తుకుపోయినట్టు ఎత్తి పక్కన పెట్టేశాడు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

