తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. డీటైల్స్ ఇవే..

తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. డీటైల్స్ ఇవే..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు భారీ శుభవార్త. రైల్వేశాఖ మరికొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సమ్మర్ హాలీడేస్ క్రమంలో రైల్వేశాఖ రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సర్వీసులను తిప్పుతోంది.

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. సమ్మర్ హాలీడేస్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో తిరుపతి వెళ్లే రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో తిరుపతికి రైల్వేశాఖ అనేక ప్రత్యేక రైళ్లను తిప్పుతోంది. అందులో భాగంగా తాజాగా మరికొన్ని కొత్త రైళ్లను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు. జూన్ 1వ తేదీ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త రైళ్ల వివరాల గురించి ఇప్పుడు చూద్దాం.

జూన్ 1 నుంచి..
తిరుపతి-రక్సల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు(17433/17434) జూన్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇది ప్రతీ సోమవారం ఉదయం 8.15 గంటలకు తిరుపతిలో బయల్దేరుతుంది. రాత్రి 12.25 గంటలకు పెద్దపల్లి, రాత్రి ఒంటి గంటకు మంచిర్యాల, త1.54 గంటలకు కాగజ్ నగర్‌కు చేరుకుంటుందని రైల్వేశాఖ తెలిపింది. ఇక తిరుగు ప్రయాణంలో ఇది ప్రతీ గురువారం ఉదయం 3.15 గంటలకు రక్సల్‌లో బయల్దేరనుండగా.. మధ్యాహ్నం 1.44 గంటలకు కాగజ్ నగర్, 2.35 గంటలకు మంచిర్యాల, 2.58 గంటలకు పెద్దపల్లికి చేరుకుంటుంది. శనివారం ఉదయం 9.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి, లింగంపల్లి, వికారాబాద్, మంచిర్యాల, కాగజ్ నగర్, కడప, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని స్టేషన్లలో ఆగనుంది. అటు తిరుపతి వెళ్లేవారి కోసం మరికొన్ని రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కరీంనగర్-తిరుపతి రైలు ప్రతి గురు, ఆదివారాల్లో సర్వీసులు అందిస్తోంది. ఇక నాందేడ్-తిరుపతి, నాందేడ్ – ధర్మవరం – నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు