ఫస్ట్ మూవీ అట్టర్ ప్లాప్.. యాక్టింగ్ రాదని విమర్శలు.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. ఈ హీరో ఎవరంటే..

ఫస్ట్ మూవీ అట్టర్ ప్లాప్.. యాక్టింగ్ రాదని విమర్శలు.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. ఈ హీరో ఎవరంటే..

ప్రస్తుతం భారతీయ సినీపరిశ్రమలోని టాప్ హీరోలలో అతడు ఒకరు. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. ఇంతకీ ఈ స్టార్ హీరో ఎవరంటే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

తండ్రి సూపర్ స్టార్.. దీంతో చిన్న వయసులోనే హీరోగా తెరంగేట్రం చేశాడు. కథానాయకుడిగా అతడి మొదటి సినిమా అట్టర్ ప్లాప్. దీంతో యాక్టింగ్ రాదంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అతడు.. కేవలం ఒక్క సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇన్నాళ్లు చాక్లెట్ బాయ్ అని ట్యాగ్ సొంతం చేసుకున్న ఆ హీరో.. ఇప్పుడు మాస్ యాక్షన్ స్టార్ గా మారిపోయాడు. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..? అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్. అతడి తొలి చిత్రం సావరియా.. 2007లో విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

రణబీర్ కపూర్ తొలి చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. దీంతో రణబీర్ కపూర్ కెరీర్ ముగిసిపోయిందని భావించారు చాలా మంది. కానీ ఆ తర్వాత హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటించారు. కానీ నటుడిగా రణబీర్ కు గుర్తింపు తెచ్చినవి మాత్రం బర్ఫీ, సంజు చిత్రాలు. ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇటీవల యానిమల్ సినిమాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది.

డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా ఊహించని రేంజ్ లో విజయం సాధించింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో రణబీర్ కు మంచి క్రేజ్ వచ్చింది. సినిమాలే కాకుండా రణబీర్ వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నాడు. నివేదికల ప్రకారం అతడి ఆస్తుల విలువ రూ.395 కోట్లు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటున్నారట. అలాగే రణబీర్ కపూర్ అనేక బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌. ఆయన దగ్గర రూ.8 కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్, రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ముంబైలోని రణబీర్ కపూర్ బంగ్లా విలువ 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం రామాయణ చిత్రంలో రాముడిగా నటిస్తున్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు