రణపాల మొక్క శాస్త్రీయ నామం బ్రయోఫిలం పినటం. అందం కోసం ఆరుబయట పెంచే ఈ మొక్కలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్కలో అనేక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి.
రణపాల శాస్త్రీయ మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి. తింటే వగరు, పులుపుగా అనిపిస్తాయి. ఈ మొక్క ఆకు ద్వారానే ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తుంది. అంటే ఈ మొక్క ఆకులను నాటితే చాలు మొక్క మొలుస్తుంది. దీంతో ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోవచ్చు. ఈ మొక్క ఆకుల వల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
- రణపాయ ఆకులు కిడ్నీల సమస్యలు, కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను రోజూ ఉదయం, సాయంత్రం రెండు చొప్పున తినాలి. లేదా ఉదయం ఆకుల కషాయాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. దీంతో కిడ్నీలు, బ్లాడర్‌లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి.
- రణపాల ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవల్స్ తగ్గుతాయి. ఇది డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది.
- రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
- రణపాల ఆకులను తినడం ద్వారా జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను తగ్గించుకోవచ్చు
- జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేసే గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు తీసుకుంటే హితకరంగా ఉంటుంది.
- రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గుతాయి.
- ఈ ఆకులను తింటే జుట్టు రాలడం తగ్గుతుందది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుంది.
- రణపాల ఆకులను పేస్ట్‌లా చేసి కట్టు కడుతుంటే కొవ్వు గడ్డలు, వేడి కురుపులు తగ్గుతాయి. శరీరంలో వాపులు తగ్గుతాయి.
- కామెర్లు ఉన్నవారు రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. దీంతో వ్యాధి నయం అవుతుంది.
- రణపాల ఆకుల రసం ఒక్క చుక్కను చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
- రణపాల ఆకులను పేస్ట్‌లా చేసి నుదుటిపై పట్టీలా వేయాలి. తలనొప్పి తగ్గుతుంది.
ఈ వివరాలు ఆరోగ్యం పట్ల మీ ప్రాథమిక అవగాహన కోసమే అని గమనించాలి. మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉన్నా వైద్యులను సంప్రదించండి…
Please follow and like us: