అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే

అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ అగ్రికల్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌- ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (ఐకార్‌- ఏఐఈఈఏ పీజీ) 2026 పీజీ నోటిఫికేషన్‌ విడుదలైంది..

దేశ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌- ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (ఐకార్‌- ఏఐఈఈఏ పీజీ) 2026 పీజీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ యూనివర్సిటీల్లో అందిస్తున్న కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. జూన్‌ 7, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, అగ్రోనమీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ/అగ్రోఫారెస్ట్రీ అండ్‌ సిల్వికల్చర్‌, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, యానిమల్ సైన్సెస్, ఫిషరీస్ సైన్స్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్‌ సైన్సెస్‌ టెక్నాలజీ, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, వాటర్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ.. విభాగాల్లో ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది. సంబంధిత విభాగంలో బీఈ, బీఎస్సీ, బీటెక్‌, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్ట్‌ 31, 2026 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 7, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్/ యూఆర్‌ అభ్యర్థులు రూ.1300, ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1255, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.675 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక ఐకార్‌- ఏఐఈఈఏ (పీజీ)-2026 రాత పరీక్ష జులై 4, 2026వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో ఒకే షిఫ్టులో నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 7, 2026.
దరఖాస్తు సవరణ తేదీలు: జూన్‌ 9, 2026 నుంచి జూన్‌ 10, 2026 వరకు
ఐకార్‌- ఏఐఈఈఏ (పీజీ) 2026 ప్రవేశ పరీక్ష తేదీ: 04.07.2026.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు