బంగారం, వెండి ధరలను మీరు మీ ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. స్థానిక పన్నులు, ఇతర పన్నులు దీనికి జోడిస్తారు. అందువల్ల, ధర నగరం నుండి నగరానికి మారుతూ ఉంటుంది. ధరలను ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు, శని, ఆదివారాలు మినహాయించి..
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. గత పదేళ్లుగా చూసుకుంటే ధరలు గణనీయంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకు విధానాలు, పెట్టుబడిదారుల మనోభావాలలో మార్పులు వంటి అంశాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి. 2011లో దాదాపు రూ. 25,000 ఉన్న బంగారం ధర.. ఇప్పుడు దాదాపు రూ. 86,000పైగా చేరుకుంది. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి బంగారం సహాయపడుతుందని ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్నారు. 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 25,000 నుండి రూ. 50,000కి చేరుకోవడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఇలాగే రూ. 50,000 నుండి రూ. 75,000కి చేరుకోవడానికి కేవలం రెండు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు, బంగారం వేగంగా రూ. 86,000 (10 గ్రాములకు) మించి పెరుగుతోంది.
ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గడం – ద్రవ్యోల్బణం పెరిగితే, రూపాయి బలహీనపడినప్పుడు, బంగారం ధర పెరుగుతుంది. బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత, అమెరికన్ విధానాల కారణంగా ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలును పెంచుతున్నారు. దీని కారణంగా దాని ధర నిరంతరం పెరుగుతోంది. వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు ప్రపంచ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్లలో వారి డిమాండ్ ఎక్కువగా ఉండవచ్చు దీని కారణంగా ధరలు అధిక స్థాయిలో ఉండవచ్చు.
కేంద్ర బ్యాంకులలో పెరుగుతున్న బంగారు నిల్వలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుతున్నాయి. స్టాక్ మార్కెట్ అస్థిరత.. ఈక్విటీ మార్కెట్‌లో అధిక అనిశ్చితి ఉంటే, పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ దృష్టి పెడతారు. అయితే ఈ ఏడాదిలో తులం బంగారం ధర రూ.1 లక్షల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత బంగారం ధర రూ. 84,300. రూ. 1,00,000 చేరుకోవడానికి, 13.5% పెరుగుదల అవసరం. ప్రస్తుత ప్రపంచ ట్రెండ్‌ను బట్టి ఇది సాధ్యమే.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వాణిజ్య విధానాలు, అమెరికాలో విధించిన సుంకాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని భావిస్తున్నారు. ఇది బంగారం ధరను మరింత పెంచుతుంది. అలాగే బౌగోళిక రాజకీయ అస్థిరత, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు బంగారం డిమాండ్‌ను పెంచుతాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయాలు, వడ్డీ రేట్లు తగ్గిస్తే, బంగారం ధర మరింత పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు $2,858 వద్ద ఉన్న బంగారం $3,000 దాటితే, భారతీయ బంగారం ధర కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
బంగారం, వెండి ధరలను మీరు మీ ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. స్థానిక పన్నులు, ఇతర పన్నులు దీనికి జోడిస్తారు. అందువల్ల, ధర నగరం నుండి నగరానికి మారుతూ ఉంటుంది. ధరలను ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు, శని, ఆదివారాలు మినహాయించి ఈ ధరలు ప్రకటిస్తారు. 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వినియోగదారులు అన్ని క్యారెట్ ధరలను తెలుసుకోవచ్చు.