హలీంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ ఆరోగ్య సమస్యలున్నవారు తింటే డేంజరే..

హలీంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ ఆరోగ్య సమస్యలున్నవారు తింటే డేంజరే..

రంజాన్ మాసం ఆరంభంతోనే నగరంలో హలీం విక్రయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. రోజంతా ఉపవాసం ఉండే వారు హలీంను కచ్చితంగా తమ మెనూలో ఉంచుకుంటారు. ఈ మాసంలో హలీం తినడం వల్ల ఉపవాస దీక్ష వల్ల కలిగి నీరసం, నిస్సత్తువ దరిచేరదని చెప్తారు. అయితే ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని మరింత ఆరోగ్యంగా చేస్తాయని చెప్తారు. అయితే, ఎంత హెల్తీ ఫుడ్ అయినా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు హలీంకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, దీనికో ప్రత్యామ్నాయాన్ని కూడా సూచించారు.

రంజాన్ మాసం ప్రారంభం కావడంతోనే నగరంలో హలీం అమ్మకాలు ఊపందుకున్నాయి. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే హలీంకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఇక ఈ పవిత్ర మాసం మొత్తం ముస్లిం సోదరులతో పాటు ప్రతి ఒక్కరూ హలీం రుచి చూస్తుంటారు. అయితే, రంజాన్ ఉపవాస దీక్షల్లో ప్రత్యేకించి తీసుకునే ఈ హలీంకి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో మీరూ చూసేయండి.

శక్తినిచ్చే సూపర్ ఫుడ్..
హలీంలో ఎన్నో పోషక విలువలు దాగున్నాయి. ఇందులో మాంసంతో పాటుగా మరెన్నో పోషకాలున్న పప్పు ధాన్యాలు, మసాలా దినుసులు వంటివి ఉపయోగిస్తారు. వీటి వల్ల హలీంని ఒక కంప్లీట్ ఎనర్జీనిచ్చే ఫుడ్ గా భావిస్తారు.

కండరాలకు బలం పెంచుతుంది..
హలీం తయారీలో జీడిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు వంటి ప్రొటీన్లు ఉండే పప్పులను వాడతారు. ఇవి శరీరంలోని కండరాల్ని బలోపేతం చేస్తాయి. కణజాలాన్ని రిపేర్ చేసి మరింత బలంగా మారుస్తాయి.

బరువు తగ్గొచ్చు..
దీని తయారీలో గోధుమలను అధికంగా వాడతారు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను గాఢిలో పెట్టడమే కాకుండా ఇందులో ఉండే పీచు పదార్థం ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంచగలదు. కాబట్టి ఇది బరువు తగ్గాలనుకునే వారికి కూడా చక్కటి ఆహారం.

ఆ వ్యాధులు దూరం చేస్తుంది..
హలీం తయారీలో అల్లం, వెల్లుల్లి, పసుపును ఉపయోగిస్తారు. వీటిలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది హైబీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధుల్ని రాకుండా చేస్తాయి. ఇది గుండె సమస్యల్ని దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆందోళన, ఒత్తిళ్ల నుంచి కూడా రక్షిస్తుంది.

వారు తినకూడదు..
మధుమేహంతో బాధపడేవారు హలీంను చక్కగా తీసుకోవచ్చు. ఇందులో ఉండే సోడియం నాడీ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. అయితే ఇందులో అధిక మొత్తంలో ఉప్పు, నూనె వినియోగం ఉంటుంది కాబట్టి వీటిని గుండె అనారోగ్యం ఉన్నవారు ఇంట్లోనే తగిన మోతాదులో వేసి తయారు చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు