బంగారం మార్కెట్‌కు భారీ షాక్.. నాలుగు రోజుల్లోనే ఇంత జరిగిందా..?

బంగారం మార్కెట్‌కు భారీ షాక్.. నాలుగు రోజుల్లోనే ఇంత జరిగిందా..?

దేశంలోని అనేక మంది పౌరులు బంగారం కొనుగోలుకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బంగారు మార్కెట్ గందరగోళంలో పడింది. గత నాలుగు రోజుల్లో బంగారు మార్కెట్లో కొనుగోళ్లు 50 శాతం తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల వ్యాపారుల ఆందోళన పెరిగింది. మరోవైపు..

పశ్చిమ ఆసియా సంక్షోభం, దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 10వ తేదీన దేశ ప్రజలందరికీ.. ‘రాబోయే ఏడాది కాలం పాటు బంగారం, వెండి కొనుగోళ్లను నిలిపివేయాలి’ అని పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో దేశీయ బులియన్ మార్కెట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది.

50% పడిపోయిన కొనుగోళ్లు:
పీఎం మోదీ ప్రకటన వచ్చిన కేవలం నాలుగు రోజుల్లోనే దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు ఏకంగా 50 శాతం మేర పడిపోయాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లలో కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి.

ఈ ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో బంగారం రంగాన్ని నమ్ముకున్న దాదాపు 60,000 నుండి 70,000 మంది కార్మికులు, స్వర్ణకారులు (కళాకారులు) ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని దేశంలోని పలు వ్యాపార, పరిశ్రమల మహాసంఘం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

వచ్చే 8 నుండి 10 నెలల్లో జ్యువెలరీ ఇండస్ట్రీ దాదాపు రూ. 1 నుండి 1.5 లక్షల కోట్ల మేర నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు దిగుమతి సుంకాన్ని (Import Duty) 15 శాతానికి పెంచడం, మరోవైపు కొనుగోళ్లు ఆపాలని కోరడం వల్ల.. మార్కెట్‌లో అక్రమంగా బంగారం స్మగ్లింగ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెళ్లిళ్ల సీజన్ కోసం కొనేవారు తప్ప సాధారణ కస్టమర్లు ఎవరూ దుకాణాలకు రావడం లేదని, అయితే, గ్రామీణ, పట్టణ ప్రాంతాల జ్యువెలరీ వ్యాపారులు ఈ నిర్ణయం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు