ఈ రోజుల్లో చాలా మంది రోటీ, పుల్కా వంటివి ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే.. వరి అన్నంతో కలిగే సైడ్ ఎఫెక్ట్‌పై చాలా మంది అవగాహన పెంచుకుంటున్నారు. అయితే, చపాతీ, రోటీలు తయారు చేసేందుకు ఎక్కువ మంది వాటిని నేరుగా గ్యాస్ మంట మీద కాల్చటం చేస్తున్నారు. కానీ, ఇది సరైనది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా కాల్చిన రోటీలు తింటే ఆరోగ్యం డేంజర్‌లో పడుతుందని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
రొట్టెలు భారతీయ ఆహారంలో భాగం. దక్షిణాదిలో కొంత తక్కువగానే తీసుకున్నా.. ఉత్తరాదిలో మాత్రం రొటీలను ఎక్కువగా తింటారు. అయితే.. వీటిని చాలా మంది పెనంపై కాకుండా నేరుగా మంటపైనే కాల్చుతుంటారు. ఇది చాలా ప్రాంతాల్లో సాధారణమే అయినప్పటికీ ఇలా రొట్టెలను నేరుగా మంటపై కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు పరిశోధనలో తేలింది.
చపాతీ, రోటీ వంటివి ఏదైనా సరే నేరుగా గ్యాస్ మంటపై అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చడం వల్ల పెను ప్రమాదం ఉంచివుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల కొన్ని హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయని, ఇవి మానవ శరీరానికి ప్రమాదమని చెబుతున్నారు. రోటీలను నేరుగా స్టౌ పై పెట్టి కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు. ఎక్కువ మంటపై వంట చేయడం వల్ల క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తుందని సూచిస్తున్నారు.
అధిక ఉష్ణోగ్రతపై వండడం వల్ల క్యాన్సర్కు కారణమయ్యే అకిలామైడ్, హెటెరోసైక్లిక్ అమైన్‌లు, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు కూడా ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. నల్లగా మారిన భాగాలలో హానికరమైన కార్బన్ సమ్మేళనాలు ఉండే అవకాశం ఉంది. వీటి వల్ల శ్వాసకోశ సమస్యలు , గుండె సమ్యలతో పాటు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.
జీర్ణ సమస్యలు, లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా నేరుగా గ్యాస్ మంటపై కాల్చిన చపాతి, రోటీ తినడం వల్ల వారి పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. జీర్ణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా మేరకు తినండి.
గ్యాస్ స్టవ్ మంటమే కాల్చిన చపాతిలు తింటే కడుపులో మంట, జీర్ణ సమస్యలు, అసిడిటీ, క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందంటున్నారు నిఫుణులు. ఒకవేళ మీకు నేరుగా మంటపై కాల్చిన రొట్టెలు నచ్చితే.. వాటిని వీలైనంత తక్కువ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందుకు బదులుగా సమతుల్యమైన ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోవాలని చెబుతున్నారు.