జాతర సీక్వెన్స్‌కి ఫ్యాన్స్ రియాక్షన్ చూసి బన్నీ ఎమోషనల్

జాతర సీక్వెన్స్‌కి ఫ్యాన్స్ రియాక్షన్ చూసి బన్నీ ఎమోషనల్

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘పుష్ప2’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఐకాన్ స్టార్ అదరగొట్టేశాడు అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గంగమ్మతల్లి అవతారంలో ఐకాన్‌ స్టార్‌ తన నట విశ్వరూపం చూపించాడని చెబుతున్నారు.

ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప-2 మేనియా కనిపిస్తోంది. యాక్షన్ సీన్స్, డ్సాన్స్‌లు ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌ అద్భుతమంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్ మరో లెవెల్లో నటించారని.. ఐకాన్‌ స్టార్‌ తన నట విశ్వరూపంతో గూస్‌బంప్స్‌ తెప్పించారంటున్నారు. పుష్ప-2 బెనిఫిట్ షోను హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి చూశారు అల్లు అర్జున్. కాగా జాతర స్వీక్వెన్స్‌కు ఫ్యాన్స్‌ నుంచి వచ్చిన అప్లాజ్ లైవ్‌లో చూసి భావోద్వేగానికి లోనయ్యారు బన్నీ.

ప్రపంచ వ్యాప్తంగా 12,500 పైగా స్క్రీన్‌లపై పుష్ప 2 రిలీజ్ అయింది. టికెట్స్ రేట్లను పెంచినా కూడా.. ‘పుష్ప 2’ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ముఖ్యంగా జాతర బ్లాక్ హైలెట్ అని అందరూ చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పుష్ప-2 మూవీ రిలీజ్‌ సందడి నెలకొంది. థియేటర్ల దగ్గర అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. మహబూబాబాద్‌లో అల్లు అర్జున్ కటౌట్స్‌కు పాలాభిషేకం చేశారు. జై బన్నీ… జై జై బన్నీ… అంటూ నినాదాలు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి భవాని థియేటర్ దగ్గర ఓ అభిమాని పుష్ప 2లో అల్లు అర్జున్ వేసిన గెటప్‌ను యాజటీజ్‌గా దించేశాడు. అల్లు అర్జున్ గెటప్‌తో వచ్చి డప్పుల దరువుల మధ్య చిందులేస్తూ ఇరగదీశాడు. అల్లు అర్జున్ డైలాగులు, కేకలు, డాన్సులతో ఫ్యాన్స్ హోరెత్తించారు.

పుష్ప 2 సినిమా విడుదలకు ముందే అనేక రికార్డులు బద్దలుకొట్టింది. ప్రీ రిలీజ్, ప్రీ బుకింగ్స్‌లో కొత్త రికార్డులు నెలకొల్పింది. ఆరు భాషల్లో 12 వేలకిపైగా థియేటర్లలో విడుదలైన ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది.

Please follow and like us:
వార్తలు సినిమా