ప్రస్తుత కాలంలో చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు.. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇటీవల గుండె పోటు ఎందరో ప్రాణాలను తీస్తోంది.. అయితే.. గుండె జబ్బు లక్షణాలు గోర్లు – చర్మంపై అనేక విధాలుగా కనిపిస్తాయి. వాటిని సకాలంలో గుర్తించడం ద్వారా చికిత్స చేయడం సులభతరం అవుతుంది..
ప్రస్తుత కాలంలో గుండె జబ్బుల కేసులు వేగంగా పెరగుతున్నాయి.. చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. రాబోయే సంవత్సరాల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అటువంటి పరిస్థితిలో గుండెపోటు ను నివారించడానికి, గుండె జబ్బుల దుష్ప్రభావాలను నివారించడానికి ముందుగా వాటి సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం.. దీని ద్వారా సకాలంలో చికిత్సను పొందడంతోపాటు ప్రాణాలను కాపాడుకోవచ్చు..
అయితే, గుండెలో అవాంతరాలను గుర్తించడానికి మేము మీకు కొన్ని సంకేతాలను చెప్పబోతున్నాం.. వీటిని సాధారణంగా ప్రజలు చిన్నవిగా పరిగణించి విస్మరిస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా ఈ లక్షణాలను గుర్తించినట్లయితే.. సకాలంలో వైద్యుడిని సంప్రదించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు..
గుండె జబ్బుల ప్రారంభానికి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకోండి..
గోళ్ళలో తెల్లని మచ్చలు
మీ గోళ్లపై తెల్లటి మచ్చలు కనిపిస్తే, అది గుండె సమస్యకు సంకేతం కావచ్చు. సాధారణంగా శరీరంలో కాల్షియం లోపం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి.. కానీ అవి గోళ్లపై కొనసాగితే, రక్తప్రసరణలో అడ్డంకి కారణంగా గుండె జబ్బులు రావడానికి సంకేతం కావచ్చు.
గోర్ల రంగు మారిపోవడం..
గోళ్ల రంగు సాధారణం కంటే మారితే దానిని తీవ్రంగా పరిగణించాలి.. గోళ్లపై నీలి, పుసుపు రంగు మచ్చలు ఉంటే శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరగడం లేదని అర్థం.. గోర్లు నీలం లేదా ఊదా రంగులోకి మారినా లేదా ఈ రంగు గీతలు కనిపించినట్లయితే దానిని విస్మరించవద్దు.. ఇది మీ శరీరంలో ఆక్సిజన్ కొరత ఉందని సంకేతం కావచ్చు.. ఇది గుండె ఆగిపోవడం, శ్వాసకోశ రుగ్మతకు దారితీస్తుంది.
చర్మంపై నలుపు లేదా ముదురు మచ్చలు
మీ చర్మంపై, ముఖ్యంగా పాదాలు, చేతుల చర్మంపై నలుపు లేదా ముదురు మచ్చలు కనిపించడం ప్రారంభిస్తే, అది గుండె జబ్బులకు సంబంధించినవి కావచ్చు. చర్మం రంగు మారడం, అకస్మాత్తుగా మచ్చలు ఏర్పడడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరగడం లేదని.. ఇది గుండె సమస్యలకు దారితీస్తుందని సంకేతం..
పొడి – చల్లని చర్మం
రక్త ప్రసరణ సరిగ్గా జరగనప్పుడు, చర్మం రంగు పాలిపోయి పొడిగా మారవచ్చు. అలాగే, చర్మం పై చాలా చల్లదనం అనిపించవచ్చు.. ఇది గుండె జబ్బులకు సంకేతం. ఈ లక్షణాలు సాధారణంగా గుండె సంబంధిత సమస్యల ప్రారంభ దశల్లో కనిపిస్తాయి.
వేళ్లలో గడ్డలు
చాలా రోజుల పాటు వేళ్లలో లేదా వేళ్ల మధ్యలో నొప్పితో కూడిన గడ్డలు ఉంటే మీ కొలెస్ట్రాల్ స్థాయి పరిమితిని దాటిందని సూచించవచ్చు. ఈ పరిస్థితి గుండెను బలహీనపరుస్తుంది. శరీరంలోని అన్ని గడ్డలూ హానికరం కానప్పటికీ, వాటి పునరావృతం శరీరంలో అభివృద్ధి చెందుతున్న వ్యాధికి సంకేతం..
అయితే.. ఇవన్నీ కేవలం సంకేతాలు మాత్రమే.. వేరే వేరే పరిస్థితుల్లో కూడా ఇలాంటి సమస్యలు కనిపించవచ్చు.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)