కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. 8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని రాష్ట్ర డీజీపీని సీవీ ఆనంద్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తక్షణపై ఘటనపై విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.
బండి భగీరథ్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ పైన నమోదు అయిన కేసుపై తక్షణమే విచారణ మొదలు పెట్టాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు ఆదేశాలు జారీ చేశారు. 8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని డీజీపీ సీఎంకు వివరించారు. దీంతో కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కూకట్ పల్లి డిసిపి రుతి రాజ్ నేతృతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు అయింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేయనుంది డిసిపి రుతిరాజ్ టీమ్. ఇప్పటికే కూకట్పల్లి పీఎస్‌లో భగీరథ్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. దీనిపై ఇరువైపులా విచారణ కొనసాగుతోంది.

