ప్రస్తుతం విజయ్, త్రిష పేర్లు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి. తమిళనాడు స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే అందరి కళ్లు ఈ ముద్దుగుమ్మ కంటే, ఈ చిన్నదాని టాటూపైనే పడ్డాయి. కొంత మంది ఆ టూటే విజయ్‌కు లక్కు తీసుకొచ్చిందంటూ ముచ్చటిస్తే మరికొంత మంది అసలు ఆ టూటూ స్పెషల్ ఇదే అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. కాగా, ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం.
ఎన్నికల్లో ఘన విజయం సాధించి , స్టార్ హీరో విజయ్ దళపతి , ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా వచ్చారు. అంతే కాకుండా తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ముఖ్యంగా చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
నీలి రంగు చీర, కొప్పులో మల్లెపూలు, అందానికే అసూయ పుట్టే విధంగా, సంప్రదాయ పద్ధతిలో రెడీ అయ్యి, ప్రతి ఒక్కరినీ తన వైపుకు తిప్పుకుంది. అంతే కాకుండా ఈ చిన్నది, అందరికీ హాయి చెబుతూ, వేడుకలో హడావిడి చేసింది. ఇక ఈ కార్యక్రమంలో ఈ ముద్దుగుమ్మను చూసిన వారందరూ కూడా తనను జయలలితతో పోలుస్తూ త్వరలో ముఖ్యమంత్రి అవుతుందంటూ ముచ్చటిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, ఈ వేడుకలో ఈ ముద్దుగుమ్మతో పాటు చిన్నదాని చేతిపై ఉన్న టాటూ కూడా వైరల్‌గా మారింది. అయితే కొంత మంది ఆ టాటూకు విజయ్‌కి ఏమైనా సంబంధం ఉందా, అది విజయ్‌కి అదృష్టాన్ని తీసుకొచ్చిందా? అసలు విజయ్ లక్కు మార్చింది ఆ టూటూనేనా అంటూ ముచ్చటిస్తున్నారు.
అయితే అసలు ఆ టాటూ విషయానికి వస్తే, అది వృషభ రాశికి సంబంధించిన టాటూ. త్రిష రాశి వృషభ రాశి. తనకు తన రాశి అదృష్టాన్ని తీసుకొచ్చిందని తాను బలంగా నమ్ముతుందంట. అందుకే తన రాశిని ఈ బ్యూటీ తన చేతిపై టాటూ వేయించుకున్నదంట. అంతే కాకుండా విజయ్ రాశి కర్కాటక రాశి. అయితే వృషభ రాశి, కర్కాటక రాశి కలియక చాలా మంచిదని, దీని వలన ఊహించని విధంగా లక్కు కలిసి వస్తుందని, పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్కాటక రాశి, వృషభ రాశి రెండూ కూడా చాలా అనుకూలమైన రాశులు, వీటి మధ్య మంచి భావోద్వేగ బంధం ఉంటుంది. అందువలన ఈ రెండు రాశుల కలయిక పెను మార్పుకు శ్రీకారం చుడతాయంట. అంతే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుందంట. అంటే త్రిష, విజయ్ స్నేహం, వీరి రాశులు కలవడం వలన విజయ్‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని కొంత మంది పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ టాటూ అంత ప్రత్యేకతను సంతరించుకుంది. నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా, పలువురు పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గుర్తించాలి.

