ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి సూపర్ హిట్స్ తర్వాత వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే.. కానీ ఈ యంగ్ డైరెక్టర్ మాత్రం ఆ సినిమాల జోలికి పోకుండా తాను నమ్ముకున్న కథతో లోకల్ గానే ఓ రేంజ్ లో హిట్స్ అందుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అనిల్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్స్ దగ్గర క్యూ కడుతున్నారు. ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలలకాలాడుతుంది.
ఇక అనిల్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా మారిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. పటాస్ సినిమాతో అనిల్ డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా విడుదలై ఇటీవలే 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 10ఏళ్లలో అనిల్ ఫ్లాప్ అంటూ ఎరుగకుండా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. పటాస్, సుప్రీమ్., రాజా ది గ్రేట్,సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 2, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో భారీ హిట్స్ అందుకొని దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే అనిల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కమెడియన్ సప్తగిరి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. అంత బెస్ట్ ఫ్రెండ్ కు తన సినిమాలో ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో కూడా చెప్పారు అనిల్. సప్తగిరి ఫోన్ చేసి తన సినిమాలో ఒక్క సీన్ రెండు సీన్స్ అయితే నేను చేయను అని అంటాడు. సరే రా ఫుల్ లెన్త్ క్యారెక్టర్ నీకు తగ్గది దొరికితే చేద్దాం లే అని నేను అన్నాను. కానీ ఇప్పటి వరకు అది కుదరలేదు. అదే వాడు ఒకటి రెండు సీన్స్ అయినా పర్లేదు అంటే.. వాడికి కోసం ఓ మంచి కామెడీ సీన్స్ చేసేవాడిని అని సరదాగా చెప్పుకొచ్చారు అనిల్. అలాగే సప్తగిరి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉన్నప్పటి నుంచి మేము మంచి ఫ్రెండ్స్ అని అనిల్ తెలిపారు.