తెలంగాణలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు నేడు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌గా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. స్పీకర్ ఎన్నిక విషయాన్ని అనౌన్స్ చేస్తారు.
కాగా, అసెంబ్లీలో స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. స్పీకర్‌ను సీఎం, మంత్రులు అధికార ప్రతిపక్ష సభ్యులు గౌరవపూర్వకంగా ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. అనంతరం స్పీకర్‌కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. స్పీకర్ చైర్ ఔన్నత్యం.. స్పీకర్ గుణగణాలు.. ఆయనతో ఉన్న పరిచయాలను సభ్యులు ప్రస్తావిస్తారు. మరోవైపు.. 111 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మద్దతు తెలిపారు.
వీరిలో 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరు సీపీఐ ఎమ్మెల్యే కాంగ్రెస్ మిత్రపక్షం మద్దతు ఉండగా.. 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏడు మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికకు మద్దతు ప్రకటించారు. ఇక, స్పీకర్ ఎన్నికకు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు.
అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పని దినాలను ఖరారు చేస్తారు. దాదాపు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఈరోజు మంచి రోజు కావడంతో ఛార్జ్ తీసుకోనున్న పలువురు మంత్రులు.
ఉదయం ఏడున్నరకు మంత్రి శ్రీధర్ బాబు, ఎనిమిదిన్నరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క బాధ్యతలు తీసుకోనున్నారు.
ఉదయం తొమ్మిది గంటలకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాద్యతలు తీసుకోనున్నారు.
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.
ఉదయం 11.30 గంటలకి అసెంబ్లీలో కేబినెట్ భేటీ.
గవర్నర్ ప్రసంగంపై కేబినెట్‌లో చర్చించనున్న మంత్రులు