అన్ని సినిమాల అప్డేట్లు ఉన్నాయి. మా హీరో అప్డేట్ ఇచ్చేదెప్పుడు… ఒకటీ రెండూ కాదు… ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇంకో సినిమా అప్పుడే ఊరిస్తోంది. అయినా అప్డేట్లకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నది పవర్‌స్టార్ ఫ్యాన్స్ తరఫున వినిపిస్తున్న మాట. బ్రో సినిమాలో కాలదేవుడిగా నటించిన పవన్‌కల్యాణ్‌నే మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు.
బ్రో సినిమాలో కాలదేవుడిగా నటించిన పవన్‌కల్యాణ్‌నే మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఓజీ బావుంటుంది చూద్దురుగానీ అని పవన్ కల్యాణ్ అన్న మాటలనే రిపీట్ మోడ్‌లో ప్లే చేసుకుని చూసుకుంటున్నారు ఫ్యాన్స్.
ఓజీ సినిమా షూటింగ్ 50 పర్సెంట్ షూటింగ్ పూర్తయింది. పవన్ కల్యాణ్‌ని బాగా ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ సబ్జెక్టుతో తెరకెక్కిస్తున్నారు. పవర్‌స్టార్ కూడా ఇష్టంగా షూట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. అయితే అంతలోనే ఎన్నికలు పూర్తి కావడం, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం… అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ ఏడాది సినిమా షూటింగుల మీద కాన్సెన్ట్రేట్ చేసే పరిస్థితిలో లేరు పవర్‌స్టార్.
పవన్ కల్యాణ్ కాస్త కాల్షీట్ సర్దుబాటు చేసేస్తే ఈ ఏడాది హరిహరవీరమల్లును రిలీజ్ చేయడానికి రెడీ అంటున్నారు ఏఎం రత్నం. ఆల్రెడీ కమిట్ అయిన ఓటీటీ డీల్ ప్రకారం ఈ ఏడాది రిలీజ్ అయితేనే సినిమాకు బెస్ట్. కానీ ఇప్పటిదాకా ప్రొడ్యూసర్‌కు పవన్ నుంచి పిలుపు రానేలేదు. అందుకే షూటింగ్ ఊసేలేదు.
అటు ఉస్తాద్ భగత్‌సింగ్ స్టోరీ ఇంకోలా ఉంది. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ రిలీజ్ పనుల్లో ఉన్నారు హరీష్ శంకర్. మరేం ఫర్వాలేదు… మీ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చాకే మనం మొదలుపెడదాం అని అంటున్నారు… అప్పటిలోపు స్టోరీని షఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎలాగూ ఉందిగా… సో… 2024లో పవన్ కల్యాణ్ మేకప్ వేసుకుంటారనే మాట ఇప్పటికైతే ఊహలో కూడా జరగనట్టే.