అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవలే తండేల్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి కథానాయికగా నటించింది.
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 7న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. నిన్న తెల్లవారుజామున నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. విడుదలకు ముందే పాటలు, ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచిన ఈసినిమా.. విడుదలయ్యాక భారీ రెస్పాన్స్ అందుకుంది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటుంది. అటు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. విదేశాల్లో ఈ సినిమా ఫస్ట్ డే 3 లక్షల 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్నితెలుపుతూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ సైతం షేర్ చేసింది.
“అలలు మరింత బలపడుతున్నాయి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో త్వరలోనే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్ దాటేస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. మరోవైపు బుక్ మై షోలో 24 గంటల్లో సుమారు 2 లక్షలకు పైగా తండేల్ టికెట్స్ అమ్మడయ్యాయి. అలాగే ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో చైతన్య మరోసారి తన అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. చైతూ కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఈ సినిమాలో రాజు, సత్య పాత్రలో నాగచైతన్య, సాయి పల్లవి జీవించేశారని..ముఖ్యంగా ఎమోషనల్ సీన్లతో చైతూ ఏడిపించేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. వీరి మధ్య హృద్యమైన ప్రేమను ముడిపెడుతూ.. దానికి సినిమాటిక్ హంగుల్ని జోడించి తెరపైన ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు. ఈ సినిమాకు సంగీతం మరో హైలెట్.