జపాన్‌ ఎయిర్‌లైన్స్‌పై సైబర్‌ దాడి.. విమాన సర్వీసులపై ప్రభావం.. నిలిచిన టిక్కెట్‌ విక్రయాలు

జపాన్‌ ఎయిర్‌లైన్స్‌పై సైబర్‌ దాడి.. విమాన సర్వీసులపై ప్రభావం.. నిలిచిన టిక్కెట్‌ విక్రయాలు

జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది. దీంతో విమానయాన సంస్థలపై భారీ ప్రభావం పడింది. టిక్కెట్ల విక్రయాలు నిలిచిపోయాయి. విమానయాన సంస్థల బ్యాగేజీ చెక్-ఇన్ సిస్టమ్‌లో కూడా సమస్య తలెత్తింది. జపాన్ ఎయిర్‌లైన్స్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. విమానా రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది. దీంతో విమానయాన సంస్థలపై భారీ ప్రభావం పడింది. టిక్కెట్ల విక్రయాలు నిలిచిపోయాయి. విమానయాన సంస్థల బ్యాగేజీ చెక్-ఇన్ సిస్టమ్‌లో కూడా సమస్య తలెత్తింది. జపాన్ ఎయిర్‌లైన్స్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది.

జపాన్ ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేస్తూ, “ఈరోజు(గురువారం, డిసెంబర్ 26) ఉదయం 7.24 నుండి మా అంతర్గత, బాహ్య నెట్‌వర్క్ పరికరాలపై సైబర్ దాడి జరిగింది. దీనివల్ల మన వ్యవస్థ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇది దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ప్రభావం చూపుతోంది. సైబర్ దాడితో టిక్కెట్ల విక్రయాలు నిలిచిపోయాయి. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం అంటూ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ట్వీట్ చేసింది.

Please follow and like us:
బిజినెస్ వార్తలు