బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్.. రికార్డు స్థాయిలో తగ్గిన ధర.. తులం ఎంతంటే

బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్.. రికార్డు స్థాయిలో తగ్గిన ధర.. తులం ఎంతంటే

గడిచిన వారం రోజుల్లో బంగారం ధర రికార్డు స్థాయిలో తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

గడిచిన పదిహేను రోజులుగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నమోదైన రేట్ల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1210 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1110 మేరకు తగ్గింది. అటు కిలో వెండిపై కూడా రూ. 1600 తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన వారం రోజుల్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారంపై రూ. 3,830 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,340కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.75,640 వద్ద కొనసాగుతోంది.
ఇదే ధర బెంగళూరు, కోల్‌కతా, ముంబై, చెన్నైలో కూడా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,490గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,790గా కొనసాగుతోంది.

వెండి ధర ఇలా..
శుక్రవారం వెండి ధర భారీగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ.98,900గా ఉంది. అటు ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో కిలో వెండి రూ. 89,400గా కొనసాగుతోంది.
కాగా, ఇవి శుక్రవారం ఉదయం 6 గంటలకు నమోదైన ధరలుగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు