ఈ రోజుల్లో ఫ్యాన్స్‌ను పబ్లిక్ ఈవెంట్స్‌లో కలవడం అంటే కత్తి మీద సామే.. పైగా పరిస్థితులు కూడా అంత బాగోలేవు. అందుకే తమ అభిమానులను కలవడానికి మరో దారి కనుక్కుంటున్నారు మన హీరోలు. టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ పెరిగిపోయిందిప్పుడు. ఇదే ట్రెండ్‌ను ఓ మెగా హీరో కూడా కంటిన్యూ చేసాడు. మరి అదేంటి..? ఫ్యాన్స్ కోసం హీరోలేం చేస్తున్నారు..?
నిజంగానే అభిమానులే లేకపోతే హీరోలెక్కడ ఉంటారు చెప్పండి..? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాన్స్‌ను హీరోలు పబ్లిక్ ఈవెంట్స్‌లో కలవడం అనేది అసాధ్యంగా మారిపోయింది.
ముఖ్యంగా పుష్ప 2 ఘటన తర్వాత ఈవెంట్స్ మరింత వేడెక్కాయి. అందుకే ఫ్యాన్స్‌నే తమ దగ్గరికి పిలుచుకుంటున్నారు హీరోలు. అప్పట్లో చిరంజీవి నెలలో నాలుగో ఆదివారం ఇలాగే ఫ్యాన్స్ కోసం కేటాయించేవారు.
తాజాగా సాయి ధరమ్ తేజ్ కూడా అభిమానులతో ముచ్చటించారు. సంబరాల యేటిగట్టు సినిమా సెట్‌లోనే అభిమానులను కలిసారీయన. యాక్సిడెంట్ తర్వాత తరుచుగా ఫ్యాన్స్‌ను కలుస్తున్నారు తేజ్. వాళ్లకు ఏం కావాలి.. ఎలాంటి సినిమాలు చేయాలనేది ఫ్యాన్స్‌నే అడిగి తెలుసుకుంటున్నారు తేజ్. సెప్టెంబర్ 25న విడుదల కానుంది ఈ చిత్రం.
తేజ్ మాత్రమే కాదు.. ఈ మధ్యే రామ్ చరణ్ కూడా ఫ్యాన్స్‌ను కలిసారు. కలవడమే కాదు.. కడుపు నిండా భోజనం పెట్టి పంపారు చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు ఓ సినిమా చేస్తున్నారు చెర్రీ. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
సంక్రాంతికి వస్తున్నాం టైమ్‌లో వెంకటేష్, ఆ మధ్య ధమాక విడుదలకు ముందు రవితేజ ఇలాగే స్పెషల్‌గా ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ మీట్‌కు అభిమానుల నుంచి కూడా ఊహించని స్పందన వస్తుంది.