చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు: సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు: సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు అని అన్నారు. సోనియా జన్మదినం రోజే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చేందుకు అంతా కలిసి పోరాడామని అన్నారు. కాంగ్రెస్‌ వచ్చాక తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు.

డిసెంబర్‌ 9 తెలంగాణ ప్రజలకు ఇష్టమైన రోజని, కృష్ణా, గోదావరి నదులు హైదరాబాద్‌లో ప్రవహించినట్లు ఉందన్నారు. ఈరోజు తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మన అదృష్టమని, తెలంగాణ వారికి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని అన్నారు. గతంలో ఒక పార్టీ కేవలం తమ కుటుంబం కోసమే ఆలోచించిందన్నారు. గతంలో ఒక పార్టీ కేవలం తమ కుటుంబం కోసమే ఆలోచించిందని, మా పార్టీ మాత్రం ప్రజల కోసం ఆలోచిస్తుందన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్‌ మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చేందుకు అంతా కలిసి పోరాడామని, కాంగ్రెస్ వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజలకు ఎంతగానో స్వేచ్ఛ లభించిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించామని, అలాగే రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘటన కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులకు రూ.64 వేలకోట్ల వడ్డీ చెల్లించామని, ఇకపై ప్రతిఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భట్టి తెలిపారు. ఇప్పటివరకు ఎవరూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదని, తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు