మార్చి 1వ తేదీ నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు కొనసాగనున్నాయని విద్యాశాఖ తెలిపింది. అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ .. పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Please follow and like us: