సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసే సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర పద్యాన్ని షేర్ చేసింది. ఇంతకీ సమంత పోస్ట్ చేసిన ఈ పద్యం అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సమంత ఈ పేరు తెలియని సగటు సినీ లవర్ ఉండరని చెప్పడంలో ఎలాంటి సందేహం. తన అందం, అభినయంతోనే కాకుండా వ్యక్తిగత క్యారెక్టర్‌తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడడం ఇలా జీవితంలో ఎదురైన కఠినమైన సంఘటనలను ఎంతో ధైర్యంగా ఉన్న సామ్ ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
తనను తాను బలంగా మార్చకుంటూ ముందుకు సాగింది. మయోసైటిస్ తర్వాత సినిమాను బాగా తగ్గిస్తూ వచ్చిన సమంత ఇటీవల సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో సమంత యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమాల్లో బిజీగా లేకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం సమంత నిత్యం యాక్టివ్‌గా ఉంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమా వివరాలతో పాటు, వ్యక్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది సామ్.
ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన పద్యాన్ని షేర్ చేసుకుంది. ‘ఈ పద్యం నాకు ఎప్పుడూ మార్గదర్శకంగా ఉంది. ఈరోజు ఈ పద్యాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అంటూ ఈ పద్యాన్ని అభిమానులతో పంచుకున్నారు సమంత. ఇంతకీ ఈ పద్యం అర్థం ఏంటంటే. ‘మీరు రిస్క్‌తో ఏదైనా కొత్త పని చేసి ఓడిపోతే.. మళ్లీ ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెట్టాలి. అంతేగానీ.. ఆ ఓటమి గురించే ఆలోచిస్తూ కూర్చోకూడదు. మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని మరింత ధైర్యంగా ముందుకు వెళ్లాలి. మీ దగ్గరం ఏం లేకపోయినా సరే సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు మనల్ని నిందించేవారికి సరైన సమాధానం చెప్పొచ్చు’ అనే అర్థంతో ఈ పద్యం ఉంది.
సమంత పోస్ట్ చేసిన ఈ పద్యం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు సమంతకు మద్ధతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సామ్ కెరీర్ విషయానికొసత్ఏ తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సామ్ సొంతంగా తెరకెక్కిస్తుండడం విశేషం.