రామ్ చరణ్, ఉపాసన గారాల పట్టి క్లింకార కొణిదెల పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు ఫేస్ రివీల్ చేశారు చెర్రీ దంపతులు. ప్రస్తుతం క్లింకార ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. మెగా ప్రిన్సెస్ ఎంత ముద్దుగా ఉందో అంటూ మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకార కొణిదెల ముఖాన్ని చూడాలని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకార కొణిదెల ముఖాన్ని చూడాలని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెలబ్రిటీల పిల్లల ప్రైవసీని కాపాడాలనే ఉద్దేశంతో చరణ్ దంపతులు ఇప్పటివరకు క్లీంకార ఫేస్ కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు క్లింకార పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్, ఉపాసన కలిసి తమ ఫ్యామిలీ ఫోటోను సోషళ్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అందులో క్లింకార తల్లిదండ్రులతో కలిసి నవ్వుతూ కనిపించింది.
ఇదిలా ఉంటే.. గతంలో బాలకృష్ణ హోస్టింగ్ చేసిన అన్ స్టాపబుల్ టాక్ షోలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. క్లీంకారపై ఎలాంటి పబ్లిక్ ఒత్తిడి ఉండకూడదని, తను ఎప్పుడైతే సొంతంగా ‘నాన్నా’ అని పిలుస్తుందో అప్పుడే అధికారికంగా ప్రపంచానికి చూపిస్తానని సరదాగా చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత తిరుమల శ్రీవారి దర్శన సమయంలో మెగా ప్రిన్సెస్ ఫోటోస్ నెట్టింట వైరల్ అయినప్పటికీ ఫేస్ మాత్రం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఉపాసన. ఇక ఇప్పుడు తమ చిన్నారి ఫోటోను స్వయంగా నెట్టింట షేర్ చేశారు రామ్ చరణ్, ఉపాసన దంపతులు. చిన్నారి క్లీంకార చాలా ముద్దుగా, క్యూట్‌గా ఉందంటూ మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట పండగ చేసుకుంటున్నారు. “అచ్చం అమ్మ ఉపాసనలాగే ఉంది”, “మెగా ప్రిన్సెస్ సూపర్ క్యూట్” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇటీవలే పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రామ్ చరణ్. డైరెక్టర్ బుచ్చి బాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరిగరాసింది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

