పన్నీర్ కొంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!

పన్నీర్ కొంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!

హైదరాబాద్‌ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో పనీర్ వ్యాపారంలో జరుగుతున్న భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు కల్తీ నూనెలు, పాలు, మసాలా దినుసులు, స్వీట్లపై దృష్టి సారించిన అధికారులు తాజాగా పనీర్ పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్న ముఠాలపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాలతో తయారైన అసలైన పనీర్‌కు బదులుగా వెజిటబుల్ ఫ్యాట్స్, వనస్పతి కొవ్వులు, ఇతర పాలేతర పదార్థాలతో తయారు చేసిన ‘చీజ్ అనలాగ్’ ఉత్పత్తులను పనీర్‌గా విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

‘మలై పనీర్’, ‘ఫ్రెష్ పనీర్’, ‘లో ఫ్యాట్ పనీర్’, ‘మిల్క్ పనీర్’ వంటి పేర్లతో విక్రయిస్తున్న అనేక ఉత్పత్తులు వాస్తవానికి పాలతో తయారైన పనీర్ కాదని అధికారులు వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి చీజ్ అనలాగ్ ఉత్పత్తులను తెప్పించి తెలంగాణలో పనీర్ పేరుతో విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.

తయారీదారులు తమ ఉత్పత్తులపై ‘చీజ్ అనలాగ్’, ‘దీనిలో పాల కొవ్వులు లేవు’ వంటి హెచ్చరికలు ముద్రిస్తున్నప్పటికీ, కొంతమంది రిటైల్ వ్యాపారులు అధిక లాభాల కోసం వాటిని ఉద్దేశపూర్వకంగా పనీర్‌గా విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల తయారీ తేదీ, బ్యాచ్ నంబర్, గడువు తేదీ వంటి కీలక వివరాలు లేకుండానే విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

పనీర్‌లో స్టార్చ్, అధిక మోతాదులో నీరు, పాలేతర కొవ్వులు, నాసిరకం, సింథటిక్ పాలు, నిబంధనలకు విరుద్ధమైన రసాయనాలను కలపడం వంటి కల్తీ పద్ధతులు కూడా వెలుగులోకి వచ్చాయి. అలాగే సరైన లేబులింగ్ లేకపోవడం, గడువు ముగిసిన ఉత్పత్తుల విక్రయం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి.

ఈ నేపథ్యంలో అధికారులు భాగ్యనగరంలోని 45 అవుట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లలో తనిఖీలు నిర్వహించి సుమారు 825 కిలోల అనుమానాస్పద ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపగా, నివేదికలు వచ్చిన తర్వాత సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కల్తీ పనీర్ వినియోగం వల్ల ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు కేవలం లైసెన్స్ పొందిన విక్రేతల వద్ద నుంచే పనీర్ కొనుగోలు చేయాలని, లేబుల్, తయారీ తేదీ, గడువు తేదీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. లూజ్‌గా విక్రయించే పనీర్ కొనుగోలు చేయొద్దని, అనుమానాస్పద ఉత్పత్తులు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు