బాక్సాఫీస్ ఛాంపియన్‌గా రామ్ చరణ్ ‘పెద్ది’.. మొదటి వారంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే?

బాక్సాఫీస్ ఛాంపియన్‌గా రామ్ చరణ్ ‘పెద్ది’.. మొదటి వారంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది రిలీజై వారం రోజులు గడిచింది. అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి భారీ వసూళ్లు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ, అలాగే ఓవర్సీస్ లోనూ రామ్ చరణ్ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా. జూన్ 04న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో పెద్ది సినిమా మొదటి వారం రన్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు రామ్ చరణ్ సినిమా ఏడు రోజుల కలెక్షన్ల వివరాలను చిత్ర బృందం ప్రకటించింది.ఇప్పటివరకు ప్రపంచవ్యాపం రూ.345 కోటకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ‘బాక్సాఫీస్ రియల్ ఛాంపియన్ గా ‘పెద్ది’ అంటూ సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఓవర్సీస్ లోనూ పెద్ది సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే 3 మిలియన్ల డాలర్క్ మార్క్ ను పెద్ది అధిగమించింది.

కాగా ఈ వారంలోనూ థియేటర్లలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. కాబట్టి మరికొన్ని రోజులు పెద్ది జోరు కొనసాగవచ్చునని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్ లో మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. వృది సినిమాస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పెద్ది చిత్రాన్ని నిర్మించారు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలు అందించారు. మరీ ముఖ్యంగా రత్నవేలు అందించిన సినిమాటోగ్రఫీ పెద్ది సినిమా సక్సెస్ లో మెయిన్ పిల్లర్ గా నిలిచింది.

Please follow and like us:
వార్తలు సినిమా