రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందో లేదో వెంటనే చెక్ చేయండి

రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందో లేదో వెంటనే చెక్ చేయండి

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సీబీటీ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. జూన్ 13 నుంచి 20, 2026 వరకు జరిగే ఫేజ్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో సంబంధిత ప్రాంతీయ ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ల నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వెలువడిన ఆర్‌ఆర్‌బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. ఇప్పటికే ఫేజ్‌ 1 పరీక్షలు పూర్తి కాగా ఫేజ్ 2 నిర్వహణకు సిద్ధం అవుతుంది. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా బోర్డు విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ సంబంధిత ప్రాంతీయ ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లలో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. జూన్‌ 13 నుంచి జూన్‌ 20వ తేదీ వరకు ఈ పరీక్షలు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతీ రోజుమూడు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ 2026 సీబీటీ 1 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

షిఫ్ట్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు, షిఫ్ట్ 2 పరీక్ష మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 2:15 గంటల వరకు, షిఫ్ట్ 3 పరీక్ష సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయి. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ యూజీ సీబీటీ పరీక్ష మొత్తం 100 ప్రశ్నలకు, 100 మార్కులకు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున కేటాయిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. మ్యాథమెటిక్స్‌, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అడ్మిట్ కార్డులను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. డ్మిట్ కార్డులు లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఆయా తేదీల్లో అభ్యర్థులు పరీక్షకు ముందు రిపోర్టింగ్ సమయానికి కనీసం ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవల్సి ఉంటుంది. అడ్మిట్‌ కార్డుతోపాటు ఏదైనా ఒక ఒరిజినల్‌ గుర్తింపు కార్డును తమతోపాటు తీసుకెళ్లవల్సి ఉంటుంది. కాగా దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 3,058 నాన్-టెక్నికల్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు