బంగారం కొనుగోళ్లపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధిస్తుందా? అసలు నియమాలు ఏమిటి?

బంగారం కొనుగోళ్లపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధిస్తుందా? అసలు నియమాలు ఏమిటి?

ప్రధాని మోదీ కేవలం ఒక సంవత్సరం పాటు బంగారం కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి మాత్రమే చేశారు. ప్రస్తుతానికి ప్రభుత్వం బంగారం కొనుగోళ్లపై పూర్తి నిషేధం విధించే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. కానీ, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి..

ఇరాన్ – అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు ఒక కీలక విన్నపం చేశారు. రాబోయే ఏడాది కాలం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని, అలాగే విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు.

ప్రధాని మోదీ విన్నపం – రాజకీయ విమర్శలు
భారతీయ సంస్కృతిలో బంగారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వివాహ శుభకార్యాల్లో దీని వినియోగం చాలా ఎక్కువ. ప్రధాని చేసిన ఈ ప్రకటనపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు, ప్రజలు బంగారం కొనడం మానేస్తే నగల వ్యాపారులు (Bullion Market) తీవ్రంగా నష్టపోతారని, దీనివల్ల నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రభుత్వం బంగారంపై పూర్తి నిషేధం విధిస్తుందా?
దేశంలో బంగారం వాణిజ్యాన్ని, దిగుమతులను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే, బంగారం కొనుగోళ్లపై పూర్తి స్థాయిలో నిషేధం విధించడం చాలా కష్టం. దీనికి గల కారణాలు ఇక్కడ ఉన్నాయి.

నియంత్రణలు, పన్నులు: ప్రభుత్వం నేరుగా నిషేధించే బదులు, దిగుమతి సుంకాలు (Import Duties) పెంచడం లేదా కొనుగోలు నిబంధనలను కఠినతరం చేయడం ద్వారా మార్కెట్‌ను నియంత్రిస్తుంది. ఇక ఇప్పటికే బంగారం దిగుమతి చేసుకునే వ్యాపారులకు ప్రభుత్వం కఠినమైన లైసెన్స్ నిబంధనలను అమలు చేస్తోంది.

దీనికి ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. భారత్ తన అవసరాలకు సరిపడా బంగారాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల డాలర్ నిల్వలు తగ్గి, వాణిజ్య లోటు పెరుగుతుంది. ఈ లోటును తగ్గించేందుకే ప్రధాని ప్రజలను బంగారం కొనవద్దని కోరారు.

ప్రధాని మోదీ కేవలం ఒక సంవత్సరం పాటు బంగారం కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి మాత్రమే చేశారు. ప్రస్తుతానికి ప్రభుత్వం బంగారం కొనుగోళ్లపై పూర్తి నిషేధం విధించే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. కానీ, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగితే నిబంధనలు మరింత కఠినతరం అయ్యే అవకాశం ఉంది.

దేశానికి ప్రధాని మోదీ 9 అప్పీల్స్‌
1 .పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా వినియోగించండి

  1. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించండి
  2. మెట్రో తరహా ప్రజా రవాణా వాడండి-మోదీ
  3. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, ఆడంబరాలు వద్దు
  4. విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలి-మోదీ
  5. ఏడాదిపాటు బంగారం కొనకుండా శపథం చేయాలి
  6. వంట నూనె వాడకం తగ్గించుకోవాలి-మోదీ
  7. ఎరువులు, రసాయనాల వినియోగం సగానికిసగం తగ్గించండి
  8. ఆన్‌లైన్‌ మీటింగ్‌లు, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయండి
Please follow and like us:
బిజినెస్ వార్తలు