ఆ పేరున్న వ్యక్తులకు హైదరాబాద్ జూ పార్క్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?

ఆ పేరున్న వ్యక్తులకు హైదరాబాద్ జూ పార్క్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?

మీరు పేరు డేవిడ్ హా.. మీరు హైదరాబాద్‌లో ఉన్నారా? అయితే మీరు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను ఇప్పుడు ఫ్రీగా సందర్శించవచ్చు. అవును నిజం. డేవిడ్ అనే పేరున్న వారికి మే 8వ తేదీన ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు జూ నిర్వాహకులు ప్రకటించారు. ఓన్లీ డేవిడ్ అనే పేరున్న వారికి మాత్రమే ఎందుకు ఫ్రీ అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.

డేవిడ్ అనే పేరున్న వ్యక్తులకు నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మే 8వ తేదీ శుక్రవారం రోజు ‘డేవిడ్’ అనే పేరు ఉన్న వ్యక్తులకు ఉచితంగా జూలోకి ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ప్రఖ్యాత ప్రకృతి శాస్త్రవేత్త, టెలివిజన్ ప్రెజెంటర్ సర్ డేవిడ్ అటెన్‌బరో 100వ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు జూ నిర్వాహకులు పేర్కొన్నారు. వన్యప్రాణుల పట్ల అవగాహన కల్పించడంలో అటెన్‌బరో చేసిన విశేష కృషికి గౌరవంగా ఈ ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు.

మీ పేరు డేవిడ్ అయితే ఫ్రీ ఎంట్రీ ఇలా పొందండి

మీ పేరు ‘డేవిడ్ ఈ అవకాన్నా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు తప్పనిసరిగా ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును అంటే ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర ఏ గుర్తింపు కార్డులు చూపించినా మీకు ఫ్రీగా జూపార్క్‌లోకి ఎంట్రీ ఉంటుంది.

ఎవరు ఈ డేవిడ్ అటెన్‌బరో?

ఇతనో ప్రకృతి శాస్త్రవేత్త, అలాగే టెలివిజన్ ప్రెజెంటర్, వంద ఏళ్ల వయసులోనూ ఆయన ఇప్పటికీ చురుగ్గా పని చేస్తున్నారంటే పని పట్ల డేవిడ్ అటెన్‌బరో అంకితభావం అర్థం చేసుకోవచ్చు. అందుకే రెండు సార్లు బీబీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు నాయకత్వం వహించే అవకం వస్తే కూడా ఆయన వెళ్లేందుకు నిరాకరించారు. ఏసీ గదుల్లో కూర్చోవడం కంటే చిత్తడి నేలల్లో మోకాళ్ల లోతు నీళ్లలో ఉండి ప్రకృతి ఆందాలను కేమరాలో బందించేందుకు ఆయన ఎక్కవ ఇష్టపడేవారు. అప్పుడు ఆయన తీసుకున్న ఆ నిర్ణయమే మనకు లైఫ్ ఆన్ ఎర్త్ , ద బ్లూ ప్లానెట్ , ప్లానెట్ ఎర్త్ వంటి అద్భుతమైన డాక్యుమెంటరీలను అందించింది..

Please follow and like us:
తెలంగాణ వార్తలు