టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనదైన ముద్ర వేశారు శివ కృష్ణ. ఒకప్పుడు సినీరంగంలో సహాయ నటుడిగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ హీరోలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
నటుడు శివ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఒకప్పుడు ఆయన బిజీ నటుడు. కానీ ఇటీవల చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ వ్యక్తిత్వం, అలాగే తన వ్యక్తిగత జీవితంలోని సేవా గురించి పలు విషయాలు వెల్లడించారు. ప్రభాస్ తన మొదటి చిత్రం ఈశ్వర్ తో సినిమా రంగ ప్రవేశం చేసినప్పుడు, అప్పటి ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ చాలా వేరుగా కనపడతారని శివ కృష్ణ అన్నారు. అయినప్పటికీ, ఆయన వ్యక్తిత్వం ఏ మాత్రం మారలేదని తెలిపారు. “ఎదిగినోడుగా ఎంత ఎదిగే కొలది వొదిగి ఉండాలి” అనే తెలుగు సామెతకు ప్రభాస్ నిలువెత్తు నిదర్శనమని, ఆయన చాలా వినయంగా, మర్యాదగా ఉంటారని అన్నారు. తాను ప్రభాస్‌ను సుమారు 15 సంవత్సరాల తర్వాత ఇటీవల కలిసినప్పుడు, ప్రభాస్ ఆయన్ను చూడగానే వ్యాన్ నుండి హుటాహుటిన దిగి పలకరించారని, ఆ గౌరవం మారలేదని ఉదాహరించారు.
ప్రభాస్ భోజనాల దగ్గర, ఇతరులతో వ్యవహరించే తీరులో ప్రదర్శించే మర్యాద, మంచితనం కృష్ణంరాజు కన్నా గొప్పదని పలువురు చెప్పడం విశేషమన్నారు. ఒక వ్యక్తి ఎందుకు ఇంతగా మెచ్చుకోబడుతున్నాడంటే దానికి బలమైన కారణం ఆయన నిస్వార్థ, వినయ స్వభావమేనని శివ కృష్ణ అన్నారు.. ఈశ్వర్ సినిమా సమయంలో, శ్రీహరిని ఒక పాత్ర కోసం కోరి తీసుకువచ్చారని, ఆ సమయంలో శివ కృష్ణకు ఆ సినిమా అవకాశాన్ని అశోక్ కుమార్ అనే తన మిత్రుడు, నిర్మాత అందించారని వివరించారు.
శామీర్‌పేట దాటిన తర్వాత బొమ్మరాశిపేట గ్రామంలోని తన స్వస్థలం మెయిన్ రోడ్డు నుండి నాలుగున్నర కిలోమీటర్ల లోపల ఉంటుందని, ఆ రోడ్డును తన తండ్రి స్వంత ఖర్చులతో వేయించారని చెప్పారు. ఆ రోడ్డు సుమారు 20 గ్రామాలకు ఉపయోగపడుతుందని, అప్పట్లో ప్రైవేటు భూమి కావడంతో ప్రభుత్వం వేయడానికి ఎవరూ ఒప్పుకోలేదని, తన తండ్రి వెళ్లి నిలబడటంతో అందరూ భూమి ఇచ్చారని వెల్లడించారు. ఇంకా, తన తండ్రి గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలను కూడా తీసుకువచ్చారని తెలిపారు.

