క్యారెట్ మజ్జిగ పులుసును చేసుకుని తింటే రుచి సూపర్ ఉంటుంది. ఈ మజ్జిగ పులుసును ఇడ్లీల్లో కూడా తింటారు. ఇంకా వేసవిలో తగిలే వడ దెబ్బకు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు
కావల్సిన పదార్దాలు : మూడు కప్పుల మజ్జిగ, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, మూడు ఉల్లిపాయలు,ఐదు పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అర టేబుల్ స్పూన్, జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.
ముందుగా క్యారెట్ తీసుకుని నీటితో కడిగి ముక్కలు చేసి, పసుపు, ఉప్పుతో ఉడికించాలి. ఇక ఇప్పుడు కొబ్బరి, జీలకర్రను మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత కవ్వంతో దానిని తిప్పుకోవాలి.
ఇప్పుడు ఉడుకుతున్నముఖాల్లో ఈ మజ్జిగను పోసి సన్నని మంటపై వేయించాలి మరి బాగా మరిగించకండి. కొద్దిగా వేడయ్యే వరకు స్టవ్ మీదే ఉంచండి. ఇలా చేస్తే మంచి రుచి ఉంటుంది.
ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ చేసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకును వేసి పోపు పెట్టుకుని దీనిలో బాగా కలుపుకోవాలి.
అంతే వేడి వేడి క్యారెట్ మజ్జిగ పులుసు రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో తింటే రుచి సూపర్ ఉంటుంది. ఈ మజ్జిగ పులుసు ఇడ్లీల్లో కూడా బాగుంటుంది. వేసవిలో తగిలే వడ దెబ్బకు ఇది బెస్ట్ రెసిపీ

