మహేష్ బాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. డైరెక్టర్ కామెంట్స్..

మహేష్ బాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. డైరెక్టర్ కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ సైతం ఈ చిత్రంలో భాగమవ్వడంతో.. మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, పరిశ్రమలోని మార్పులు, భవిష్యత్ ప్రణాళికలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అంతర్జాతీయ స్టార్‌గా ఎదగడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన తనకు అత్యంత సన్నిహితుడని తెలిపారు. మహేష్ బాబు ఈ స్థాయికి చేరడం పట్ల గొప్ప సంతోషం ఉందని, అయితే మళ్లీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందో లేదోనన్న చిన్న ఆందోళన కూడా ఉందని సరదాగా అన్నారు. చిరంజీవి, రామ్ చరణ్ వంటి స్టార్లతో పనిచేసిన శ్రీను వైట్ల, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో ఇంకా సినిమాలు చేయలేదని, భవిష్యత్తులో వారితో పనిచేయాలనే కోరికను వ్యక్తం చేశారు. తన కాంబినేషన్ యూనిక్‌గా ఉంటుందని, ఈ హీరోలందరితో రావాలని ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారని నిర్వాహకురాలు పేర్కొన్నారు.

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్‌పై మాట్లాడుతూ, ఇది రాజమౌళి గారి ద్వారా ప్రారంభమైన అద్భుతమని అన్నారు. కేజీఎఫ్, సలార్, పుష్ప, దేవర వంటి చిత్రాలు దీని ద్వారా లబ్ధి పొందాయని తెలిపారు. అయితే, ప్రతి సినిమానూ పాన్ ఇండియాగా రూపొందించడం సరికాదని, కథకు లేదా హీరోకు ఆ స్థాయిని తట్టుకునే సామర్థ్యం, విస్తృత అప్పీల్ ఉంటేనే అది విజయవంతమవుతుందని ఆయన తెలిపారు. స్థానిక కథాంశాలకు ప్రాధాన్యత ఇచ్చే చిత్రాలు కూడా ముఖ్యమని, అవి కూడా తమదైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ప్రస్తుత పాన్ ఇండియా చిత్రాలలో నేటివిటీ, భాషా స్వచ్ఛత లోపించడంపై ప్రశ్నించగా, విస్తృత ప్రేక్షకుల కోసం చిన్నచిన్న రాజీలు అనివార్యమని అన్నారు.

సినిమాకు ఏది ప్రధానమన్న ప్రశ్నకు “కథే ఆత్మ” అని శ్రీను వైట్ల స్పష్టం చేశారు. కథ తర్వాతే హీరో ఇమేజ్, సాంకేతిక విలువలు, ప్రొడక్షన్, ప్రమోషన్ వంటివన్నీ కలసి సినిమా విజయానికి దోహదపడతాయని అన్నారు. ఇటీవల చూసిన సినిమాలలో విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం స్క్రీన్‌ప్లే తనకు బాగా నచ్చిందని తెలిపారు. పొన్నియన్ సెల్వన్ ఒక గొప్ప ప్రొడక్షన్ అయినా, తెలుగు ప్రేక్షకులకు పేర్లు, చరిత్ర కొత్తగా ఉండటం వల్ల అర్థం చేసుకోవడం కష్టమైందని వ్యాఖ్యానించారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు