కరీంనగర్‌లో ఖతర్నాక్ సైబర్ క్రైమ్ గ్యాంగ్ చెక్ పెట్టారు పోలీసులు. ఆపరేషన్ క్రాక్‌డౌన్‌తో చైనా లింకుల డొంకల్ని కదిలించారు. కమీషన్ కక్కుర్తి చైనా సైబర్ క్రిమినల్స్‌తో చేతులు కలిపిన ఇంటి దొంగలను కటకటాల బాట పట్టించారు. 8 ఖాతాల నుంచి 137 కోట్ల రూపాయలు తరలించినట్టు దర్యాప్తులో తేలింది. 13 మంది నిందితుల అరెస్ట్ చేశారు.
కరీంనగర్‌లో ఖతర్నాక్ సైబర్ క్రైమ్ గ్యాంగ్ చెక్ పెట్టారు పోలీసులు. ఆపరేషన్ క్రాక్‌డౌన్‌తో చైనా లింకుల డొంకల్ని కదిలించారు. కమీషన్ కక్కుర్తి చైనా సైబర్ క్రిమినల్స్‌తో చేతులు కలిపిన ఇంటి దొంగలను కటకటాల బాట పట్టించారు.
స్మార్ట్‌ఫోన్లకు లింకులు పంపి ఖాతాల్లో దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు.. ఆ డబ్బును క్రిప్టో కరెన్సీలో చైనాకు తరలిస్తున్నారు. అందుకోసం మ్యూల్ అకౌంట్స్ వాడుతున్నారు. అలాంటి సైబర్ కేటుగాళ్లకు ఇదిగో ఇట్టాంటి 420 బ్యాచ్.. మ్యూల్ అకౌంట్లను అరెంజ్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్స్ పై ఫోకస్ పెట్టిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, క్రాక్‌డౌన్ పేరిట స్పెషల్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అంతే కూపీలాగితే కరీంనగర్‌లో ఆర్‌బీఎల్ బ్యాంక్ కరెంట్ ఖాతాల నుంచి మ్యూల్ అకౌంట్ల ద్వారా చైనాకు నగదు బదిలీ చేస్తున్న వైనం బయటపడింది. 8 ఖాతాల నుంచి 137 కోట్ల రూపాయలు తరలించినట్టు దర్యాప్తులో తేలింది. 13 మంది నిందితుల అరెస్ట్ చేశారు. ఈ స్కామ్‌లో బ్యాంక్ ఎంప్లాయిస్ కూడా ఉన్నారన్నారని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు.
ఖాతాకు ఇంత కమీషన్ అంటూ కస్టమర్లను బురిడీ కొట్టించడమే కాదు, ఫేక్ ఖాతాల కోసం బ్యాంక్ అధికారులకు ఎర వేసిన వైనం ఆపరేషన్ క్రాక్‌డౌన్ బ్రేక్ చేసింది. ఈ దగుల్బాజీ ముఠాకు లీడర్ జగిత్యాల జిల్లా వెల్గటూరుకు చెందిన బండారి సాయిరాం. ప్రతి ట్రాన్సాక్షన్‌కు అతను 35 వేల కమీషన్ ముట్ట చెప్పేవాడు. ఇక టోటల్ అమౌంట్‌లో అతనికి 2 పర్సెంట్ కమిషన్. డైరెక్ట్‌గా చైనా వాళ్లతో బాత్‌చీత్.. పాయింట్ టు పాయింట్ ఎంక్వయిరీలో తెరపైకి వచ్చింది. ఈ బడా క్రైమ్‌లో బ్యాంక్ అధికారుల రోల్ అండ్ రీల్ కూడా పోలీసుల విచారణ తెరపైకి వచ్చింది. మ్యూల్ అకౌంట్.. కోట్లలో ట్రాన్సాక్షన్లు.. క్రిప్టో కరెన్సీ.. చైనా సైబర్ క్రిమినల్స్‌తో మాటా మంతి.. ఇంత చేశారంటే వీళ్లకు బాగా చదువొచ్చు అనుకుంటే తప్పుకాలేసినట్టే. ఎందుకంటే చదువకుంది అంతంత మాత్రమే.
తిన్నంటి వాసులు లెక్కపెట్టినట్టుగా చైనోడు ఉమ్మేసే కమీషన్ల కోసం వెంపర్లాడే ఇలాంటోళ్లను ఏమనాలి? ఇంటి దొంగలా? దేశద్రోహులా! కమీషన్‌కు కక్కుర్తి పడినా.. ఇలాంటోళ్ల ట్రాప్‌లో పడినా.. తెలిసిచేసినా తెలియకచేసినా మ్యూల్ అకౌంట్ల జోలికి వెళ్తే చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అలాంటోళ్లు ఎవరైనా కమీషన్ ఎరతో ట్రాప్ చేయాల్సిన చూస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

