తిరుపతి ఆకాశంలో మేఘాల అమరకితో అద్భుత దృశ్యం ఏర్పడింది. శ్రీవేంకటేశ్వరస్వామి నగరంలో మహాదేవుడు లింగరూపంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ దర్శనమిచ్చాడు. భక్తులను హరహర మహదేవ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. మరోవైపు, ఓ సీతాకోక చిలుక గోవింద నామ రూపంలో దర్శనిచ్చి ఆశ్చర్యపరిచింది.
ఆకాశంలో మేఘాల కదలికలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మేఘాల కదలికలు, అమరికలు కొన్ని కొన్ని ఆకృతులను ఏర్పరచి ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా, పరమ పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. తిరుపతి ఆకాశంలో మేఘాలు అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాయి. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతి నగరంలో మహాదేవుడు దర్శనమిచ్చాడు. ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ మహా లింగరూపం సాక్షాత్కరించింది. ఆకాశంలో పరమేశ్వరుడు లింగరూపంగా దర్శనమివ్వడంతో భక్తులందరూ హరహర మహదేవ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
గోవింద నామ రూపంలో..
నిరంతరాయంగా గోవింద నామస్మరణతో మారుమ్రోగే తిరుపతి నగరంలో మరో అపురూప దృశ్యం కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి పవిత్ర నామం తలపించేలా.. ఓ సీతాకోకచిలుక భక్తులను ఆకట్టుకుంది.
వేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉదయం 11 గంటలకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

