తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు వారం రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణశాఖ విడుదల చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని అలర్ట్ జారీ చేసింది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశముందని హెచ్చరించింది.

రాబోయే మూడు రోజులు వర్షాలు
అటు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్లు, గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయని హెచ్చరించింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగంతో వీస్తాయని తెలిపింది. అటు రాయలసీమలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. రేపు, ఎల్లుండి మోస్తరు వానలు పడతాయని స్పష్టం చేసింది. అటు ఏపీలో పలు ప్రాంతాల్లో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదని, ఆ తరువాత 3 రోజుల్లో 2 – 3 డిగ్రీల సెంటిగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముందని అంచనా వేసింది.

తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ
అటు తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడతాయని, హైదరాబాద్‌లోనూ వర్షాలు కురుస్తాయంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. వర్షాల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కాగా తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పుడు వర్షాలు పడుతుండటంతో ఎండ ప్రభావం నుంచి కాస్త ఉపశమనం లభించింది. దీంతో ప్రజలకు చల్లని కబురుగా చెప్పవచ్చు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు