రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉద్యోగులకు 15% నుంచి 20% వరకు డిస్కౌంట్ ఇవ్వాలని కంపెనీలకు సూచనలు సూచనలు చేశామని, ప్రభుత్వం నుంచి ఆయా కంపెనీలతో ఒప్పందం..
కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్ -డీజిల్పై ఆధారాన్ని తగ్గించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా EV పాలసీ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ తెలిపింది. వాహనాల కొనుగోలుపై భారీ రాయితీలు, సబ్సిడీలు అందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్:
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉద్యోగులకు 15% నుంచి 20% వరకు డిస్కౌంట్ ఇవ్వాలని కంపెనీలకు సూచనలు సూచనలు చేశామని, ప్రభుత్వం నుంచి ఆయా కంపెనీలతో ఒప్పందం కుదర్చుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే కొన్ని వాహన తయారీ సంస్థలు అంగీకారం తెలిపాయని, దీంతో ఉద్యోగులకు తక్కువ ధరకే EVలు లభించే అవకాశం ఉందని అన్నారు.
సామాన్యులకు కూడా భారీ లాభాలు:
అంతేకాకుండా EV పాలసీ కేవలం ఉద్యోగులకే కాదు, సాధారణ ప్రజలకూ వర్తిస్తుంది. కొత్త ఎలక్ట్రిక్ కారుపై రూ.1 లక్ష వరకు ప్రోత్సాహకం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% మినహాయింపు ఇవ్వనున్నట్లు, అలాగే దీని వల్ల మొత్తం ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు.
ప్రజా ప్రతినిధులకు లోన్ సౌకర్యం:
ప్రజా ప్రతినిధులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక వాహన రుణాలు (loans) అందించనున్నట్లు తెలిపారు. EVల వినియోగాన్ని అన్ని స్థాయిల్లో పెంచే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి పోన్నం తెలిపారు.
స్క్రాపేజీ పాలసీతో అదనపు ప్రయోజనాలు:
2024 సెప్టెంబర్ నుంచి అమలులో ఉన్న స్క్రాపేజీ పాలసీ ద్వారా పాత వాహనాలను తొలగించేందుకు ప్రోత్సాహం ఇస్తున్నారు.
పాత వాహనాలపై ఉన్న పన్ను బకాయిల మాఫీ
కొత్త వాహనం కొనుగోలుపై ట్యాక్స్ రాయితీలు
బైక్లకు రూ.5,000 వరకు
కార్లకు రూ.50,000 వరకు
ట్రాన్స్పోర్ట్ వాహనాలకు 19% వరకు ట్యాక్స్ తగ్గింపు
రాష్ట్రంలో స్క్రాపింగ్ సెంటర్లు రంగారెడ్డి జిల్లాలో కొత్తూరు, సిద్దిపేట జిల్లా వర్గల్, సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ EV పాలసీ వల్ల ప్రయోజనాలు ఏంటి?
👉 ఎలక్ట్రిక్ వాహనాలు మరింత చవకగా లభించనున్నాయి
👉 కాలుష్యం తగ్గించడంలో సహాయపడుతుంది
👉 భవిష్యత్తులో పర్యావరణానికి అనుకూలమైన రవాణా పెరుగుతుంది
మొత్తానికి, ఈ పాలసీ ఉద్యోగులు, సామాన్యులు, ప్రజా ప్రతినిధులు అందరికీ లాభదాయకంగా మారనుంది.

