ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై బిగ్‌ అలర్ట్.. అర్హులు వీరే!

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై బిగ్‌ అలర్ట్.. అర్హులు వీరే!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనే అంశంపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే జూన్ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం అర్హులను గుర్తించేందుకు ఓ సర్వే చేపట్టింది. అసర్వే ఆధారంగానే అర్హులైన 1.15కోట్ల కుటుంబాలకు పథకాన్ని వర్తింప చేస్తున్నట్టు ప్రకటించింది. ఇంతకూ ఆ సర్వే ఏంటి, అర్హులు ఎవరో తెలుసుకుందాం.

రాష్ట్రంలోని పేద కుటుంబాలకు భద్రతను కల్పించేందుకు తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ జీవిత బీమా అనే సరికొత్త పథకాన్ని తీసుకురానుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు అన్ని సిద్ధం చేస్తోంది.ఈ పథకం కోసం ఈ ఆర్థిక బడ్జేట్‌లో రూ.4వేల కోట్ల నిధులను కూడా కేటాయించింది. అయితే ప్రస్తుత రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా పథకం మాదిరిగానే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రమాదశాత్తు లేదా అనారోగ్యం కారణంగా ఏ కుటుంబమైతే ఇంటి పెద్దను కోల్పోతుందో వారికి ఈ పథకాన్ని వర్తింప చేయనున్నట్టు తెలుస్తోంది. కుటుంబ పెద్దను కోల్పోయిన ఫ్యామిలీలకు భరోసాను ఇచ్చేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ పథకానికి అర్హుల ఎవరనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో అర్హులుగా తేలిన కుటుంబాలన్నింటికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాలకు గుర్తించేందుకు ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సుమారు 1.15 కోట్ల మంది లబ్ధిదారులను గుర్తించారు. ప్రస్తుతం ఈ సర్వే ఆధారంగానే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నారు.

అయితే ఈ పథకం కోసం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4వేల కోట్లు కేటాయించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు పేర్కొంది. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలుస్తోంది. గత ప్రభుత్వం నుంచి మహిళల పేరిటే రేషన్ కార్డులనూ జారీ చేస్తూ వచ్చారు. అప్పుడు కుటుంబ పెద్దలుగా మహిళలే ఉంటారు. అయితే మరి ఈ పథకం కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు మాత్రమే వర్తిస్తుందా, లేదా పురుషులకు కూడా వర్తిస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు