కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. సీటొస్తే అదృష్టమే! లింక్‌ ఇదే

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. సీటొస్తే అదృష్టమే! లింక్‌ ఇదే

కేంద్రీయ విద్యాలయాల్లో (KV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతితోపాటు బాల్‌వాటికల్లో ప్రవేశాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్ధులు తల్లిదండ్రులు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఏప్రిల్ 2, 2026వ తేదీ వరకు దరఖాస్తు..

దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (KV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతితోపాటు బాల్‌వాటికల్లో ప్రవేశాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్ధులు తల్లిదండ్రులు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఏప్రిల్ 2, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవీల్లో ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ సిబ్బంది పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో కొన్ని సీట్లను వివిధ కోటాలు, రిజర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధుల వయసు 2026 మార్చి 31వ తేదీ నాటికి ఆరేళ్లు నిండి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు ఇవే..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: మార్చి 20, 2026.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 2, 2026.
తొలి ఎంపిక జాబితా (బాల్‌వాటికలకు): ఏప్రిల్ 8
తొలి ఎంపిక జాబితా ఒకటో తరగతికి: ఏప్రిల్ 9
రెండో జాబితా విడుదల తేదీ: ఏప్రిల్ 16
మూడో జాబితా విడుదల తేదీ: ఏప్రిల్ 21
ఒకటో తరగతి, బాల్‌వాటికల్లో ఒకటి, రెండో, మూడో తరగతి ప్రవేశాలకు మాత్రమే ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మిగిలిన తరగతుల్లో ఖాళీలను బట్టి ఆయా కేవీ విద్యాలయాల్లో స్వయంగా వెళ్లి దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. బాల్‌వాటిక 2, రెండో తరగతి నుంచి (11వ తరగతి మినహా) 9వ తరగతి వరకు ఖాళీలను బట్టి ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటి ఎంపిక తొలి జాబితా ఏప్రిల్ 13న విడుదలవుతుంది. అడ్మిషన్లు ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య జరుగుతాయి. మొత్తం ప్రక్రియ జూన్ 30తో ముగుస్తుంది. ఇక పదో తరగతి ఫలితాలు వచ్చిన 10 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత కూడా సీట్లు మిగిలితే డిప్యూటీ కమిషనర్‌ ప్రత్యేక అధికారాలతో జులై 7వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు