గ్యాస్ కొరత వేళ కేంద్రం మరో కఠిన నిర్ణయం.. సిలిండర్ తీసుకోవాలంటే అది తప్పనిసరి.. ఆదేశాలు వచ్చేశాయ్..

గ్యాస్ కొరత వేళ కేంద్రం మరో కఠిన నిర్ణయం.. సిలిండర్ తీసుకోవాలంటే అది తప్పనిసరి.. ఆదేశాలు వచ్చేశాయ్..

కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై డెలివరీపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరుసగా కొత్త రూల్స్ తీసుకొస్తున్న కేంద్రం.. ఇప్పుడు మరో కఠిన నిబంధన అమల్లోకి తెచ్చింది. అదేంటంటే.. ఓటీపీని తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వల్ల గ్యాస్ డెలివరీలో జాప్యం జరుగుతుంది.

గ్యాస్ కొరత క్రమంలో కేంద్రం సిలిండర్ల డెలివరీ, బుకింగ్స్‌కు సంబంధించి అనేక కొత్త నియమాలు ప్రవేశపెడుతోంది. కొరతను నివారించేందుకు, బ్లాక్ మార్కెట్లను అడ్డుకునేందుకు అనేక రూల్స్ తీసుకొస్తుంది. ఇప్పటికే గ్యాస్ బుకింగ్స్ వెయింటింగ్ పీరియడ్‌ను పెంచగా.. ఇంటి అవసరాల కోసం మాత్రమే డెలివరీ చేయాలని కంపెనీలకు ఆదేశించింది. ఇక అక్రమ గ్యాస్ సిలిండర్లను కట్టడి చేయడంపై దృష్టి పెట్టిన కేంద్రం.. అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అక్రమంగా గ్యాస్ సరఫరా చేస్తున్న వారిని పోలీసులు పట్టుకుని సిలిండర్లను సీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో సిలిండర్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది.

ఓటీపీ తప్పనిసరి
ఇక నుంచి గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఇంటికి డెలివరీ చేసే సమయంలో ఓటీపీని తప్పనిసరి చేసింది. ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ చేసుకున్నాక వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. డెలివరీ బాయ్ ఇంటికి వచ్చి గ్యాస్ సిలిండర్ ఇచ్చే ముందు ఓటీపీ తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. ఓటీపీ తప్పనిసరిగా నమోదు చేయాలని, ఓటీపీ కన్ఫర్మేషన్ అయ్యాకనే సిలిండర్ అందించాలని కేంద్రం స్పష్టం చేసింది. బుకింగ్ చేసుకున్న వచ్చాక ఓటీపీ, బిల్లులో ఉండే ఓటీపీ ఒకేలా ఉండాలి. అది చెక్ చేశాకే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అందించాలని కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక వచ్చే ఓటీపీని కస్టమర్లు భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే గ్యాస్ పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గ్యాస్ డెలివరీలో జాప్యం
గతంలోనే ఇలాంటి విధానం ఉండగా.. కొన్ని ఏజెన్సీలు పట్టించుకునేవి కాదు. కానీ ఇప్పుడు దీనిని కేంద్రం తప్పనిసరి చేసింది. గ్యాస్ సిలిండర్లు అక్రమమార్గం పట్టకుండా ఇది సహాయపడుతుంది. అయితే తప్పనిసరిగా ఓటీపీ నమోదు చేయాలనే నిబంధన వల్ల గ్యాస్ డెలివరీలో జాప్యం జరుగుతోంది. కొన్నిసార్లు కస్టమర్లు ఇంట్లో అందుబాటులో ఉండరు. వినియోగదారుడికి ఫోన్ చేసి ఓటీపీ తెలుసుకుని నమోదు చేయాలంటే ఆలస్యమవుతోంది. ఈ ప్రక్రియ వల్ల సమయం వృధా అవ్వడం వల్ల గ్యాస్ డెలివరీ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని ఏజెన్సీలు చెబుతున్నాయి. వినియోగదారులు ఇంట్లో అందుబాటులో లేకపోవడం, ఓటీపీ తెలుసుకునేందుకు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం వల్ల డెలివరీ చేయడంలో జాప్యం జరుగుతందని అంటున్నారు. గ్యాస్ కొరత ఏం లేదని, బుక్ చేసుకున్న రెండు, మూడు రోజుల్లో డెలివరీ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు, గౌడౌన్లలో సరిపోయేంత స్టాక్ అందుబాటులో ఉందని, వినియోగదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు