తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.. మార్చి మొదటి వారంలోనే.. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనంతోపాటు.. ద్రోణి కొనసాగుతుందని.. వీటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.. మార్చి మొదటి వారంలోనే.. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనంతోపాటు.. ద్రోణి కొనసాగుతుందని.. వీటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని.. రేపు కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఒడిశా – దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగింది. దీంతోపాటు.. ఒడిశా – దాని పరిసర ప్రాంతాలలో నున్న ఉపరితల ఆవర్తనం నుండి తీరప్రాంత కర్ణాటక వరకు అంతర తెలంగాణ, అంతర్గత కర్ణాటక ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య, నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:-
శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది.
ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడి, తేమ – అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. వడ గాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది.
రాయలసీమ :-
శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
గమనిక :- రాగల 2 రోజుల్లో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. ఆ తరువాత 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ద్రోణి ఒకటి ఒడిస్సా పరిసరాలలో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా కర్ణాటక తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ఉదయం 05:30 గంటలకు ఏర్పడి ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
శనివారం, ఆదివారం, సోమవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.

