దళపతి విజయ్‌తో విడాకులు.. భరణంగా సంగీతకు ఎన్ని కోట్లు రానున్నాయంటే?

దళపతి విజయ్‌తో విడాకులు.. భరణంగా సంగీతకు ఎన్ని కోట్లు రానున్నాయంటే?

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి విడాకుల వ్యవహారం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ తో విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత దాఖలు చేసిన పిటిషన్ త్వరలోనే విచారణకు రానుంది.

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ నుంచి విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ నటితో విజయ్ కు అఫైర్ ఉందని సంగీత ఆరోపించింది. ఈ క్రమంలో తన కుటుంబ పోషణ, జీవనోపాధి కింద విజయ్ ఆస్తుల్లో 50 శాతం చెల్లించాలని ఆమె కోర్టును కోరింది. కాగా దళపతి విజయ్ ఆస్తుల విలువ సుమారు రూ. 600 కోట్లు. మరి ఇప్పుడీ ఆస్తుల్లో 50 శాతం అంటే సంగీతకు దక్కుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వస్తున్న ప్రశ్న ఏమిటంటే..ఒక వేళ తీర్పు సంగీతకు అనుకూలంగా వస్తే, విజయ్ తన ఆస్తులలో 50% ఇవ్వాల్సి వస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జోహో సీఈవో శ్రీధర్ వెంబు, ప్రమీలా శ్రీనివాసన్ డైవోర్స్ దేశంలో అత్యంత ఖరీదైన విడాకులుగా పరిగణిస్తున్నారు. అలాగే హృతిక్ రోషన్, సుస్సాన్ ఖాన్ విడాకుల సమయంలో, అతను తన భార్యకు దాదాపు రూ.380 కోట్ల విలువైన ఆస్తిని ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ కూడా రూ.600 కోట్ల ఆస్తులలో సంగీతకు 50% వాటా ఇస్తాడా? అన్నది ప్రధాన ప్రశ్న.

అయితే పాశ్చాత్య దేశాలలో లాగా భారత చట్టం ఆస్తిని 50-50 శాతం విభజించడాన్ని తప్పనిసరి చేయలేదు. విడాకులు తీసుకున్న తర్వాత భార్యకు తన భర్త ఆస్తిలో 50% ఇవ్వాలని భారత చట్టం ఆదేశించదు. ’50-50 ఆస్తి విభజన’ నమూనా కొన్ని పాశ్చాత్య దేశాలలో సాధారణం, కానీ భారతదేశంలోని చట్టాలు భిన్నంగా ఉంటాయి. భార్యాభర్తలిద్దరి ఆదాయం, ఇంటి ఖర్చులు, పిల్లల అవసరాలు తదితర అంశాలను కోర్టు నిశీతంగా పరిశీలిస్తుంది. ప్రతి కేసు భిన్నంగా ఉంటుంది. అలాగే, దళపతి విజయ్ సంపాదించిన ఆస్తిలో అతని సొంత ఆస్తి? అతని తండ్రి సంపాదించిన ఆస్తి ఎంత? మొదలైన అంశాలను పరిగణణలోకి తీసుకుంటుంది. ఆ తర్వాతే విడాకుల భరణంపై ఓ అంచనాకు వస్తున్నారా?

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు