ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 5,000 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయి 5,626 డాలర్లతో పోలిస్తే తక్కువే. ఇకపోతే ప్రస్తుతం(గత శుక్రవారం) భారత మార్కెట్..
గత నెలలో (జనవరి) బంగారం, వెండి ధరలు వేగంగా పెరిగాయి. ఈ విలువైన లోహాల ధరల పెరుగుదలకు పరిమితి లేనట్లుగా దూసుకుపోయింది. ఇప్పుడు అవి ఎంత వేగంగా పెరిగాయో అంతే వేగంగా తగ్గుతున్నాయి. ధరల పెరుగుదలతో కలత చెందిన సామాన్యులు సైతం ఖరీదైన ధరలకు ఆభరణాలను కొనుగోలు చేయక తప్పలేదు. బంగారం ధరలో ప్రస్తుత తగ్గుదల చాలా మంది సామాన్య భారతీయులకు ఉపశమనం కలిగించింది. బంగారం, వెండి ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. ఎన్నడు లేని విధంగా భారీ స్థాయిలో దిగి రావడం శుభవార్తేనని చెప్పాలి.
జనవరి 29న బంగారం వెండి ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.17,885కి చేరుకుంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.16,395కి పెరిగింది. నేడు ఈ ఆభరణాల బంగారం ధర రూ.14,200కి పడిపోయింది. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణుల నివేదికలు చెబుతున్నారు.
బంగారం ధర ఎందుకు తగ్గుతోంది?
బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయో అర్థం చేసుకునే ముందు దాని ధర ఎందుకు పెరిగిందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రపంచ రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది పెట్టుబడిదారులు బంగారం, వెండి ETFలలో పెట్టుబడి పెట్టారు. అదనంగా వివిధ కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. బంగారం ధర పెరగడానికి ఇవి రెండు ప్రధాన కారణాలు.
బంగారం ధర ఇప్పుడు తగ్గడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. బంగారు ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టిన వారు లాభాలను బుక్ చేసుకోవడం ఒక కారణం. అదేవిధంగా రష్యా అమెరికా ఆంక్షలలో కొన్నింటిని పాటించాలని నిర్ణయించింది. రష్యా- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బంగారం ధర తగ్గడానికి ఇవే కారణాలుగా చెబుతున్నారు.
బంగారం ధర రూ.10,000కి తగ్గుతుందా?
డాలర్లలో వ్యాపారం చేయడానికి నిరాకరించిన రష్యా ఇప్పుడు తన వైఖరిని మార్చుకుంది. రష్యా తన బంగారాన్ని అమ్మేసి డాలర్ కరెన్సీని కొనుగోలు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. అమెరికా – రష్యా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉంది. వీటిలో ఏదైనా నిజమైతే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతాయి. బంగారం ధర గ్రాముకు రూ.10,000 కు పడిపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు నిపుణులు.
జనవరి 2026లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల Gold ధర రూ. 1,80,779 అనే ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఈ రికార్డు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత వారం శుక్రవారం నాటికి MCX బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,56,200 వద్ద ముగిసింది.
2025లో బంగారం ధర ఆకాశాన్నంటింది. గతేడాది క్రమంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈ ఏడాది జనవరిలో గరిష్ట ధరకు నమోదు అయ్యింది. 2026 జనవరిలో భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.80లక్షలు దాటి రికార్డు సృష్టించింది. అయితే ఫిబ్రవరి నెల వచ్చేసరికి బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,200 వద్ద ముగిసింది. అంటే తన గరిష్ట స్థాయి నుంచి 13.5 శాతం మేర పతనమైంది.అయితే ఈ బంగారం ధరల వ్యత్యాసంపై ప్రముఖ ఆర్థిక వేత్త, పేస్ 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. అది కూడా 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలలోపు పడిపోయే అవకాశం ఉంది అని అమిత్ గోయల్ వెల్లడించారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 5,000 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయి 5,626 డాలర్లతో పోలిస్తే తక్కువే. ఇకపోతే ప్రస్తుతం(గత శుక్రవారం) భారత మార్కెట్ 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,56,200 వద్ద ఉంది. ఈ ఏడాది జనవరిలో నమోదైన బంగారం ధర రూ.1,80,779. ఈ వ్యత్యాసం గమనిస్తే 13.5శాతానికి తగ్గింది అని అమిత్ గోయల్ వెల్లడించారు.

