ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సినిమా పాటలను మించి దూసుకుపోతున్నాయి. యూట్యూబ్ లో ఒక్కో పాటకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. పక్కా లోకల్ వైబ్.. ఊర మాస్ లెవల్లో ఉంటున్న ఈ పాటలకు నెట్టింట ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రతి పాట ఒక్కో స్థాయిలో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్.. ఏకంగా 35 కోట్లకు పైగా వ్యూస్ అందుకుని సెన్సేషన్ అయ్యింది.

తెలంగాణ ఫోక్స్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ జానపద పాటలే యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. సినిమా పాటలకు మించి దూసుకుపోతున్నాయి. ఒక్కో పాటకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. రాము రాథోడ్, సింగర్ మంగ్లీ, సింగర్ ప్రభ పాడిన పాటలు నెట్టింట రికార్డులు తిరగరాస్తున్నాయి. అలాగే ఫోక్ డ్యాన్సర్స్ జాను లిరి, నాగదుర్గ, వైష్ణవి వంటి వారు చేసే మాస్ స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. కొన్ని రోజులుగా ఫోక్స్ సాంగ్స్ సత్తా చాటుతున్నాయి. అన్నీ పాటలు ఒక ఎత్తు అయితే రాము రాథోడ్, లిఖిత కాంబోలో వచ్చిన రాను బొంబాయికి రాను సాంగ్ ఖండాంతరాలను దాటేసి దుమ్మురేపుతుంది. ఇప్పటికే యూట్యూబ్ లో 497 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించింది. ఈ పాట తర్వాత మరో సాంగ్ సైతం నెట్టింట రికార్డ్స్ కొల్లగొట్టింది.

రాను బొంబాయికి రాను తర్వాత ఆ స్థాయిలో యూట్యూబ్ లో సత్తా చాటుతున్న పాట ‘ఓ పిలగా వెంకటి..’ 2024లో విడుదలైన ఈ పాట యూట్యూబ్, ఇన్ స్టా రీల్స్ లో హాట్ ట్రెండ్ అయ్యింది. ఈ పాటలోని మాస్ బీట్, లిరిక్స్ యువతతోపాటు అన్ని వర్గాల వారిని ఆకర్షించింది. అలాగే ఈ పాటకు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ స్టెప్పులేసిన వీడియోస్ సోషల్ మీడియాను నింపేశాయి. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.

ఎప్పటిలాగే ఈ పాటను సొంతంగా రాసి.. అదరగొట్టేసింది ఫోక్ సింగర్ ప్రభ. అలాగే ఈ పాటకు వెంకట్ అజ్మీరా సంగీతం అందించగా.. పూజా నాగేశ్వర్, రౌడీ హరీష్ నటించారు. ఈ పాటకు యూట్యూబ్ లో 354 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డులు కొల్లగొడుతుంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు